ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఓర్వకల్ : పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరు.చరితా రెడ్డి సూచనల మేరకు ఓర్వకల్లు మండలంలోని, బైరాపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా-పెన్షన్లను ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని, ఓర్వకల్లు మండల టిడిపి అధ్యక్షులు దుగ్గపూటి నాగిరెడ్డి, రాంభూపాల్ రెడ్డి, వెంకటాద్రి , ఆదిరెడ్డి, రవి, గొల్ల కృష్ణ, దానమయ్య వెంకటరామిరెడ్డి, నాగ శంకర్, సచివాలయ సిబ్బందితో కలిసి లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి నగదును పంపిణీ చేయడం జరిగింది. ఈ పింఛన్ల పంపిణీ సందర్భంగా ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని మాట్లాడుతూ నూతన సంవత్సరం-2026 ను పురస్కరించుకొని పేదలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ముందుగానే ఇవ్వడం జరిగింది అన్నారు. స్థానికంగా ప్రజల సమస్యలను, మౌలిక సదుపాయాల కల్పన గురించి, ప్రభుత్వ పనితీరు వంటి అంశాలపై నేరుగా ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా కేవలం 18 నెలల పాలనలో ఎన్టీఆర్ భరోసా ఇప్పటివరకు రూ.50,000 కోట్లకు పైగా పెన్షన్ల కోసం వ్యయం ఏడాదిలో రూ.33,000 కోట్లు పంపిణీ, నెలకు రూ.2,750 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం పంపిణీ చేసిందని అన్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ప్రజల అభివృద్ధి సంక్షేమం కాంక్షించే “మంచి ప్రభుత్వం” మాది అని అన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, టిడిపి నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వం అధికారులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News