ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలానికి చెందిన ఎస్.షర్పద్దీన్ అలి నీ (ఐఎఫ్ డబ్ల్యూ జె) ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ మెంబర్ గా ఎంపిక చేసినట్లు రాష్ట్ర అధ్యక్షులు పి.రామకృష్ణ తెలియజేశారు. ఈ సందర్భంగా ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ ఆంధ్ర ప్రదేశ్ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామకృష్ణ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల కోసం మేము గత 50 సంవత్సరాల నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిరంతరము పోరాడుతున్నామన్నారు. ఈ పోరాటాల ద్వారానే గతంలో వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు, రైల్వే పాసులు, ఇంటి స్థలాలు, కార్పొరేట్ విద్యా సంస్థలలో 50% ఫీజు రాయితీలు తదితరుల వాటిని సాధించడం జరిగిందన్నారు. ఇందులో కొన్నింటిని గత 12 సంవత్సరాలుగా ప్రక్కన పెట్టిన ప్రభుత్వాలపై నిరంతరం పోరాటం చేస్తున్నామన్నారు. 50 సంవత్సరాలు నిండిన జర్నలిస్టులందరికీ తమిళనాడు రాష్ట్రం మాదిరిగా నెలకు పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, ఇంటి స్థలాలు ఇచ్చి, ఇండ్లు కట్టించి ఇవ్వాలని, రైల్వే పాసులు కూడా మంజూరు చేయాలని, విలేకరుల సంక్షేమానికి కృషి చేయాలని, ప్రెస్ క్లబ్ ల ఏర్పాటుకు సహకారం అందించాలని, విలేకరులకు రక్షణ కల్పించాలని, వారి పిల్లలకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించాలని, తదితర సమస్యలపై అలుపులేని పోరాటం చేస్తున్నామని తెలిపారు. ఇంకా ఉమ్మడి కర్నూలు జిల్లా నుండి మా (ఐఎఫ్ డబ్ల్యూజె) జర్నలిస్టు యూనియన్ లో రాష్ట్ర కమిటీ సభ్యులుగా తుపాకుల రమేష్, జి.ప్రవీణ్ కుమార్, ఎం.వెంకట రమేష్ , భావన వినోద్ కుమార్, జి.గోవిందు, కలబండి.మోషే, మాడుగుల.రాము గౌడ్, కే.నాగన్న, బి.స్వాములు, షేక్.మహబూబ్ బాషా, బలరాం, సి.వెంకట శివుడు, కే.నాగస్వామి నాయక్, కే.అంకన్న, ఆర్.మురళీమోహన్, శ్రీనివాసులు, రాఘవేంద్ర, తదితరులు ఎంపీక కావడం జరిగిందనీ రాష్ట్ర అధ్యక్షులు పి.రామకృష్ణ తెలిపారు.
Admin
E Nivas News