Monday, 14 September 2026 03:51:40 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

వివక్ష లేని కులరహిత సమాజమే ఎస్సీ కమిషన్ లక్ష్యం

కొత్తపల్లి శామ్యూల్ జవహర్ ఎస్సీ కమిషన్ ఛైర్మన్

Date : 21 January 2026 08:41 PM Views : 167

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : షెడ్యూల్డ్ కులాల హక్కుల కోసం పనిచేస్తూనే, వివక్ష లేని కులరహిత సమాజమే లక్ష్యంగా ఎస్సీ కమిషన్ పనిచేస్తుందని ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కె.ఎస్.జవహర్ అన్నారు. స్థానిక జింఖానా గ్రౌండ్స్ లోని, కందుకూరి కళ్యాణ మండపంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సీ కమిషన్ సభ్యుల ప్రమాణ స్వీకారమహోత్సం బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా సభ్యులు మేకల.బిక్షం (బాబు), ఎన్టీ.రామాంజినమ్మ, రావాడ సీతారామ్, పి.గౌతమ్ రాజ్, డాక్టర్ శ్రీపతి బాబు ల చేత ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కే.ఎస్.జవహర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎస్సీ కమిషన్ ఛైర్మన్ జవహర్ మాట్లాడుతూ రాజ్యాంగబద్ధ పదవిని స్వీకరించిన సభ్యులు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, అణగారిన కులాల గొంతుకగా ఎస్సీ కమిషన్ నిలవాలన్నారు. ఎస్సీల్లోని 59 కులాలకు పక్షపాత దోరణి లేకండా నిష్పక్షపాతంగా సేవలు అందించాలన్నారు. దళితుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వారి ఉన్నతికి పాటు పడటమే ఎస్సీ కమిషన్ లక్ష్యంగా ఉండాలన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనపై ఉంచిన నమ్మకాన్ని అంతే బాధ్యతగా నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా కమిషన్ పనిచేస్తుందని, బాధితులకు న్యాయం చేయటమే కమిషన్ లక్ష్యమన్నారు. కమిషన్ సభ్యులు తమ హక్కులు, బాధ్యతలు తెలుసుకుని వ్యవహరించాలని కోరారు. కుల అహంకారులు, రెండు గ్లాసుల విధానం పాటించే వారిపై అంకుశం ఎక్కుపెట్టాలని సమసమాజ స్థాపనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వ్యవస్థలో సమూల మార్పు కోసం ఎస్సీ కమిషన్ శ్రమిస్తుందని హామీ ఇచ్చారు. దళితులు రాజకీయంగా ఎదగాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. మాజీ మంత్రి, వినియోగదారుల రక్షణ మండలి ఛైర్ పర్సన్ పీతల సుజాత మాట్లాడుతూ దళితుల సమస్యల కోసం నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు, నాయకులు తమ కోసం కాకుండా సమాజంలోని అసమానతలను తొలగించడానికి పోరాడితే చరిత్రలో నిలిచిపోతారన్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా ఎస్సీ కమిషన్ పనిచేయాలని పిలుపునిచ్చారు. శాసనసభ్యులు, టిటిడీ బోర్డు సభ్యులు ఎం.ఎస్. రాజు మాట్లాడుతూ దళితులకు రక్షణ, ఆత్మగౌరవం, సంక్షేమం కూటమి పాలనలోనే దక్కాయన్నారు. ఎస్సీలకు న్యాయం జరిగేలా రక్షణ హక్కుల కోసం ఎస్సీ కమిషన్ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ విలువలతో పదవీ బాధ్యతలు నిర్వహించే చైర్మన్ కేఎస్ జవహర్ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ గా ఉండటం రాష్ట్రంలో ఎస్సీలకు రాజకీయాలకు అతీతంగా ఖచ్చితంగా న్యాయం జరుగుతుందన్నారు. గత ఐదేళ్లలో ఎస్సీలపై అఘాయిత్యాలు, దాడులు పెరిగిపోయాయని, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి ఎస్సీలకు సంపూర్ణ న్యాయం జరుగుతుందన్నారు. శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడుతుందని, వారి ఉజ్వల భవిష్యత్ కు పునాది వేస్తూ వారి ఉన్నతికి నిరంతరం పాటుపడుతుందన్నారు. పార్లమెంట్, శాసనసభ స్పీకర్ లుగా బాలయోగి, ప్రతిభా భారతి లను ఎన్నుకున్న చరిత్ర ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. దళితుల హక్కుల కాపాడటంలో ఎస్సీ కమిషన్ సభ్యులు గురుతర బాధ్యతలు నిర్వహించాలని ఆకాంక్షించారు. పల్నాడు జిల్లా పిన్నెల్లిలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవను పార్టీలకు చుట్టి రాజకీయం చేయాలని చూస్తున్న సంఘటనపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని ఎస్సీ కమిషన్ ఛైర్మన్ జవహర్ ను శాసనసభ్యులు కోరారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సభ్యులు మేకల భిక్షం (దాసు) మాట్లాడుతూ శక్తి వంచన లేకుండా పనిచేసి దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడుతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎక్కడ దళితులకు ఎవరికి అన్యాయం జరిగినా కూడా వారికి న్యాయం జరిగేలా నా వంతు కృషి చేస్తానన్నారు. అనంతరం నూతనంగా ఎస్సీ కమిషన్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించిన సభ్యులను నాయకులు, అభిమానులు శాలువాలు కప్పి, పూలమాలలు మెడలో వేసి, ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో కూటమి నాయకులు, దళిత కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :