ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, ప్రభుత్వ రేషన్ షాపుల డీలర్ల సంఘం అధ్యక్షుడు జి.నాగభూషణరావు, కార్యదర్శి ఎం.వి.సుధాకర్, ట్రెజరర్ ఎస్.టి. హుస్సేన్ సాహెబ్ ల ఆధ్వర్యంలో తమ సమస్యలు పరిష్కరించాలని అందరితో కలిసి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం వారు తహసీల్దార్ జీ.సుభద్రమ్మకు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు జి.నాగభూషణం రావు, కార్యదర్శి ఎం.వి.సుధాకర్, ట్రెజరర్ ఎస్.టి.హుస్సేన్ సాహెబ్, తదితర నాయకులు మాట్లాడుతూ ప్రస్తుతం ఇస్తున్న కమిషన్‌ను రూపాయి నుంచి మూడు రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రతి రెండు కార్డులకు ఒకేసారి 50 కిలోల బియ్యం కేటాయించే విధానాన్ని మార్చాలని, బియ్యం బస్తాలను కాటపై పెట్టే విధానాన్ని తొలగించాలని కోరారు. అలాగే ఎంఎల్‌ఎస్ పాయింట్ల వద్దే బియ్యం బస్తాలను తూకం వేసి, క్లియర్ కోడ్ స్కానింగ్ అనంతరం రేషన్ దుకాణాలకు పంపించాలని విజ్ఞప్తి చేశారు. రేషన్ షాపుల్లో స్కానింగ్ నిర్వహించేందుకు ప్రభుత్వం స్మార్ట్ మొబైల్ ఫోన్లు అందించాలని కోరుతూ తహసీల్దార్-జి.సుభద్రమ్మ కు డీలర్ల సంఘం నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ ల సంఘం సభ్యులు కె.హైమావతి, బి.చంద్రకళ, ఎం.శేఖర్, ఎం.సునీల్, పి.గోపాలరెడ్డి, ఈ.మాణిక్యారావు, ఎస్.సంజన్న, ఎస్.తిరుపాలు, టి.శేషపని శర్మ, బి.సుబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News