Wednesday, 16 September 2026 03:23:37 AM
# కే.సి.కెనాల్ లో ప్రమాదవశాత్తుపడి పదో తరగతి విద్యార్థి మేకల లింగస్వామి మృతి # వినాయక నిమజ్జన ఘాట్‌లను పరిశీలించిన జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపీఎస్ # ఆగా ఖాన్ ఫౌండేషన్ ద్వారా సహకారం అందించాలి... సీఎం రేవంత్ రెడ్డి # సామూహిక దీక్షలో ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలి # ఏపీ మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపం.. # చెన్నూర్ ను ఆధునిక పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం.. # మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్...

రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు

వెలుగోడు మండలంలోని, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల పేద టెన్త్ టాఫర్స్ విద్యార్థులకు ఘన సన్మానం

Date : 30 July 2026 09:54 PM Views : 79

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / వెలుగోడు : పేద విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు వెలుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో "విద్యార్థి ప్రోత్సాహక అభినందన సభ" గురువారం పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ముందు పాఠశాల ఆవరణలోని సరస్వతి, ఫాతిమాబీ, మహాత్మా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పాఠశాలలో, విద్యాబుద్ధులు నేర్పిన కీర్తిశేషులైన గురువులు మరియు విద్యార్థుల స్మృతికి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ప్రతిభను గుర్తించి ప్రభుత్వ, ప్రైవేట్ టాపర్స్ సత్కారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండలంలోని, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల 10వ తరగతి టాపర్స్‌కు శాలువాలు కప్పి, పూలమాలలు మెడలో వేసి, మెమొంటోలు చేతికి అందించి ఘనంగా సన్మానించారు. అదేవిధంగా వెలుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రతిభ చాటిన పేద విద్యార్థులకు మొత్తం రూ.1లక్ష, 35 వేల నగదు ప్రోత్సాహకం స్కాలర్షిప్‌లు అందజేశారు. ఇందులో 15 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.6000, 6 మందికి రూ.5000 చొప్పున, మూడు వేల రూపాయల చొప్పున ఒకరికి, 6 మందికి రూ.1500 చొప్పున, ఒకరికి రూ.1000/- చొప్పున అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నం సుధాకర్ రెడ్డి దంపతులకు, సిఎ పూర్తి చేసిన తాళ్లూరి శ్యామ్‌కు పూర్వ విద్యార్థుల సంఘం ఘనంగా సన్మానం చేసింది. పేద విద్యార్థులకు చేయూతనిచ్చిన పూర్వ విద్యార్థుల సంఘం సేవలను పలువురు అభినందించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని, పూర్వ విద్యార్థుల సంఘం అందిస్తున్న ప్రోత్సాహం ఇతరులకు ఆదర్శమని కొనియాడారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా పూర్వ విద్యార్థుల సేవలు మన వెలుగోడు పట్టణ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఉండడం మనందరి అదృష్టం అని అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం మాలిక్ ఖాన్, ఇన్చార్జి హెచ్ఎం మొయినుద్దీన్, మాజీ సర్పంచ్ వేల్పుల జయపాల్, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు జి.రామలింగారెడ్డి, మక్బుల్ బాషా, వై.సుధాకర్ రెడ్డి, జయరామిరెడ్డి, నసురుల్లా ఖాన్, శ్రీకాంత్ రెడ్డి, సుల్తాన్ మొహిద్దిన్, జె.రఫిక్ అహ్మద్, నారాయణ, శ్రీరాములు, ప్రభుత్వ -ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు, హెచ్ఎంలు డాక్టర్ ఎంఎఫ్. ఇమ్మానియేల్, అతావుల్లా, నరసింహులు, తదితర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: