Monday, 14 September 2026 02:10:30 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

వైద్య సేవ‌ల్లో నిర్ల‌క్ష్యాన్ని స‌హించేది లేదు...! ప్ర‌తి ఒక్కరికీ నాణ్య‌మైన వైద్యం అందాల్సిందే

ఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ‌

Date : 21 January 2026 07:59 PM Views : 246

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పటిష్టమైన ప్రణాళికతో అనేక సంక్షేమ పథకాలు, ఆరోగ్య కార్యక్రమాలను అమలు చేస్తోందని, ఈ కార్యక్రమాల సమర్థవంతమైన అమలుతో ప్రతి పౌరుడికి నాణ్యమైన, సకాలంలో వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ అన్నారు. వైద్య సేవల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు. బుధవారం నగరంలోని, గిరిపురం అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీహెచ్‌సీ)ను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె కేంద్రంలోని వైద్యులు, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించి, విధులకు సకాలంలో హాజరవ్వాలని ఆదేశించారు. అనంతరం ఓపీ సేవల నిర్వహణ, రోగులకు అందుతున్న వైద్య పరీక్షలు, కన్సల్టేషన్ రూమ్‌ల పనితీరు, టెలీ క్లినిక్ సేవల అమలు తీరును సమీక్షించారు. లేబొరేటరీ విభాగంలో జరుగుతున్న పరీక్షలు, నివేదికల జారీ విధానం, అవసరమైన పరికరాల అందుబాటు గురించి అడిగి తెలుసుకున్నారు. ఫార్మసీ విభాగాన్ని తనిఖీ చేసి, మందుల నిల్వలు, ఉచితంగా అందిస్తున్న ఔషధాల పంపిణీ, రోగులకు సరైన సమాచారం అందిస్తున్నారా అనే అంశాలపై సిబ్బందికి సూచనలు చేశారు. అదేవిధంగా జాతీయ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం అమలు తీరును పరిశీలించి, చిన్నారులు, గర్భిణులు తప్పనిసరిగా టీకాలు పొందేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. వివిధ ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించిన సమాచార పట్టికలు, అవగాహన పోస్టర్ల‌ను, ఆయుష్మాన్ భార‌త్ హెల్త్ అకౌంట్ (ఏబీహెచ్ఏ) ప్ర‌యోజ‌నాల స‌మాచారాన్ని సక్రమంగా ప్రదర్శించాలన్నారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలపై నమ్మకం పెంచుకునేలా సేవలు అందించాలని, శుభ్రత, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన సేవలే లక్ష్యంగా పనిచేయాలని సిబ్బందికి క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ స్పష్టం చేశారు. *స‌మ‌స్య ఉంటే క‌లెక్ట‌ర్‌కు నేరుగా తెలియ‌జేయండి* ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో వైద్య సేవ‌ల‌పై అభిప్రాయాలు, లేదా స‌మ‌స్య ఉంటే ఆయా ఆసుపత్రుల్లో ప్రదర్శించిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి (8885592974) ప్ర‌జ‌లు నేరుగా తెలియ‌జేయ‌వ‌చ్చ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తెలిపారు. ఆసుప‌త్రుల్లో అందించే సేవ‌ల‌పై నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ ఉంటుంద‌న్నారు. స‌మ‌ర్థ‌వంత‌మైన మాన‌వ వ‌న‌రులు, నిధులు వెచ్చిస్తూ ప్ర‌జ‌ల‌కు ఆరోగ్య భ‌ద్ర‌త క‌ల్పించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: