Friday, 11 September 2026 08:13:14 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

విద్యార్థినిలు, మహిళలు రక్షణ కొరకు తప్పనిసరిగా శక్తి యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి:- షేక్.నూర్ అహమ్మద్ (ఏఎస్ఐ)

Date : 02 August 2026 06:37 PM Views : 141

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : ఆత్మకూరు పోలీస్ సబ్ డివిజన్ " శక్తి యాప్ అవేర్నెస్ టీం " సిబ్బంది నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ ఉత్తర్వుల మేరకు ఆత్మకూరు డి.ఎస్.పి- ఆర్.రామాంజి నాయక్ మరియు ఆత్మకూరు రూరల్ సీఐ- ఎం.సురేష్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఆత్మకూరు " శక్తీ టీం " సిబ్బంది పాములపాడు ఏఎస్ఐ- షేక్.నూర్ అహమ్మద్, డబ్ల్యూహెచ్ జి సుప్రియ ల ఆధ్వర్యంలో పాములపాడు ప్రభుత్వ ఎస్సీ బాలికల వసతి గృహంలోని, విద్యార్థినులకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ డి.అనిత విజయ కుమారి అధ్యక్షతన " శక్తీ యాప్ అవేర్నెస్ " ప్రోగ్రాము లో భాగంగా మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన " శక్తి యాప్ " గురించి, మరియు శక్తి యాప్ వాట్సాప్ నంబర్ 7993485111 గురించి తెలుపుతూ, మహిళల రక్షణకై ఏర్పాటు చేసిన పోక్సో చట్టం గురించి, బాల్యవివాహాలు, చిన్న పిల్లలపై నేరాలు జరగకుండా ఆపుటకు 1098 ఫిర్యాదు చేయవలెనని, 18 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయకూడదని అట్లా ఎవరయినా చేస్తునట్లయితే 112 కు గానీ, 1098 కి ఫోన్ చేసి చెప్పాలని అన్నారు. ఉమన్ వెల్ఫేర్ 181, ఎమర్జెన్సీ కాల్ 112, 100 కి ఫోన్ చేయవలెనని, సైబర్ క్రైమ్ జరిగినచో టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి ఫోన్ చేయవలెనని, ఫేక్ కాల్స్, ఏపీకె. ఫైల్స్ లాంటివి ఏదన్నా మీ పేరెంట్స్, లేక మీకు సెల్ ఫోన్ వాట్సప్ లకు ఎవరైనా లింక్ మెసేజ్లు పంపితే వాటిని ఓపెన్ చేయొద్దు అని తెలుపుతూ, వాటి ద్వారా జరిగే ఆర్థిక నష్టాలను గురించి కూడా తెలిపి, వన్ స్టాప్ సెంటర్ యొక్క ప్రాముఖ్యతను వివరించడం జరిగింది. ఆండ్రాయిడ్ సెల్ ఫోన్లలలో శక్తీ యాప్ డౌన్ లోడ్ చేసుకొని అత్యవసర సమయాలలో శక్తీ యాప్ ను ఎలా వాడాలి, దానీ ఉపయోగాల గురించి తెలుపడమే కాకుండా మీరు మంచి క్రమశిక్షణ తో మెలుగుతూ జన్మనిచ్చిన తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలన్నారు. ఆడపిల్లలను "ఈవిటీజింగ్ " పేరుతో ఎవరైనా ఆకతాయిలు అల్లరి పట్టించడం లాంటివి చేస్తే ఏ మాత్రం అధైర్య పడకుండా మీకు రక్షణగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శక్తీ యాప్ ను ఉపయోగించి 112 కు గానీ, 1098 కి గానీ ఫోన్ చేసి సహాయం పొందవచ్చు అని అవగాహన కల్పించారు. చదువు మీద ధ్యాస పెట్టి బాగా కష్టపడి చదివి మీ జీవితాలను తీర్చిదిద్దుకోవాలని. చదువు ఒక్కటే మిమ్మల్ని సమాజంలో గౌరవాన్ని, మర్యాదను, హుందాతనాన్ని తీసుకొచ్చి మీ తలరాతలను మార్చేది చదువు ఒక్కటే అని అన్నారు. అదేవిధంగా మీ ఇంట్లోని మీ పేరెంట్స్ మోటార్ సైకిళ్లను నడిపేటప్పుడు ఖచ్చితంగా తలకు రక్షణగా " హెల్మెట్ " పెట్టుకొని ప్రయాణం చేయాలని హెల్మెట్ యొక్క ప్రాముఖ్యతను గురించి అవగాహన కల్పించడం జరిగింది. మరియు ఎవ్వరూ కూడా, మీ ఇంట్లోని వారు నాన్న, అన్నా, బాబాయి, మేనమామ లు ఎవ్వరైనా సరే మధ్యం త్రాగి వాహనాలను నడపవద్దని చెప్పమని సూచిస్తూ, త్రాగి వాహనం నడిపితే కోర్టు వారు 10 వేల రూపాయలు ఫైన్ లేదా జైలు శిక్ష ను విధిస్తారని తెలుపుతూ అవేర్నెస్ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సీ బాలికల వసతి గృహం వార్డెన్ విద్యార్థినిలు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :