Thursday, 30 July 2026 12:10:26 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటనలో సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి ఎమ్మెల్యే బుడ్డా.రాజశేఖర్ రెడ్డి

Date : 16 January 2026 09:45 PM Views : 206

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / : కోనసీమ జిల్లా : తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలకు సంక్రాంతి పండుగ ప్రతీక అని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. గురువారం డా.బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని, మురముళ్ళ గ్రామంలో జరిగిన సంక్రాంతి సంబరాలకు స్థానిక ముమ్మడివరం నియోజకవర్గ ఎమ్మెల్యే సుబ్బరాజు, అమలాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనందరావు లతో కలిసి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారు అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు ప్రజలు, సంక్రాంతి సంబరాల నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. సంక్రాంతి అంటే పండుగ మాత్రమే కాదు... తెలుగువారి ఆత్మగౌరవానికి, ఐక్యతకు, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. మన మూలాలను గుర్తు చేసుకునే ఈ పండుగను మీ అందరి మధ్య జరుపుకోవడం ఆనందంగా, సంతోషంగా ఉందని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి పేర్కొన్నారు. సంక్రాంతి పండుగలు తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగువారు తమ మాతృభాషను, సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదే. ఆ సంస్కృతి బతికేలా, గ్రామీణ జీవనం బాగుపడేలా నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంప్రదాయాలకూ సమాన ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహా స్వామి వారి సేవలో కోనసీమ జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి వశిష్ఠ గోదావరి తీరాన వెలసిన అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహా స్వామి వారికి దర్శించుకున్నారు. అంతకు ముందు క్షేత్రానికి విచ్చేసిన ఎమ్మెల్యే బుడ్డా కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్లకు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్యే వెంట కే.సి.కెనాల్ ప్రాజెక్టు చైర్మన్ బన్నూరు రామలింగారెడ్డి, నాయకులు అన్నారపు శేషిరెడ్డి, వై.యుగంధర్ రెడ్డి తదితరులున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :