Wednesday, 29 July 2026 06:37:04 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు నైట్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇవ్వాలి

పి ఆర్ టి యు

Date : 25 November 2025 06:28 PM Views : 1974

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు వారంలో రెండు రోజులు 3వ వంతు ఉపాధ్యాయులు నైట్ డ్యూటీ చేయాలనే ఆదేశాలను ఉపసంహరించుకోవాలని పి ఆర్ టి యు నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ చాంద్ బాష డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా, ఆత్మకూరు మండలంలోని, పలు ప్రాథమిక, ఉన్నత, గిరిజన సంక్షేమ పాఠశాలలు సందర్శించి ఉపాధ్యాయుల చేత సభ్యత్వ నమోదులు చేయించారు. ఈ సందర్భంగా పి ఆర్ టి యు నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్.చాంద్ బాష మాట్లాడుతూ ప్రధాన సమస్యలు ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు నైట్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇవ్వాలనీ, ఆశ్రమ పాఠశాలల్లో వార్డెన్ ను నియమించాలనీ, కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులైజ్ చేయాలనీ, పదో తరగతి పరీక్షల 100 రోజుల యాక్షన్ ప్లాన్ ను సెలవు రోజుల్లో మినహాయింపు ఇవ్వాలనీ, మహిళ ఉపాధ్యాయులకు, పిల్లల వయస్సు 18 ఏళ్లు నిండే వరకు మాత్రమే అనే నిబంధన తొలగించి చైల్డ్ కేర్ లీవ్ జీవో విడుదల చేయాలనీ, ఉపాధ్యాయుల పెండింగ్ సరెండర్ లీవ్ బకాయిలు చెల్లించాలనీ, పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయాలి, 30% మధ్యంతర భృతి ఇవ్వాలనీ, డీఎస్సీ- 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలనీ, సిపిఎస్ రద్దు కోసం కార్యాచరణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. పిఆర్టియు ఆత్మకూరు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సి.ప్రదీప్ కుమార్, జి.హనుమంతు ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పిఆర్టియు నాయకులు చంద్రశేఖర్, కలిముల్లా, హుస్సేన్ సాహెబ్, రషీద్, ఖాజా, మీర్ ఇబ్రాహీం, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: