ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పాములపాడులోని, రెవెన్యూ కార్యాలయం దగ్గర తహసిల్దార్ జి.సుభద్రమ్మ, పోలీస్ స్టేషన్ దగ్గర ఎస్సై పి.తిరుపాలు, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు దగ్గర చైర్మన్ సి.గోవిందు, శ్రీ వివేకానంద విద్యా విహార్ హైస్కూల్ దగ్గర కరస్పాండెంట్ ఆర్ఎస్ఆర్. గోపాల్, మద్దూరు సొసైటీ దగ్గర చైర్మన్ వాడాల జనార్దన్ రెడ్డి, కేసి. కెనాల్ నీటి సంఘం అధ్యక్షుడు జీ.తిమ్మారెడ్డి లు, కేజీబీవీ దగ్గర ప్రిన్సిపాల్ ఎం.రాజ్యలక్ష్మి, ప్రభుత్వ జూనియర్ కళాశాల దగ్గర ప్రిన్సిపాల్ వి.ఎం.వెంకటేశ్వర్లు, వేంపెంట సచివాలయం దగ్గర చైర్మన్ లక్ష్మీకాంతరెడ్డి, టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం.మోహన్ గౌడు, బిజెపి కార్యాలయం దగ్గర అధ్యక్షుడు రాయపాటి మురళి మోహన్, గ్రంథాలయం దగ్గర లైబ్రేరియన్ సి.వి.కృష్ణారెడ్డి, అదేవిధంగా మండలంలోని అన్ని ప్రభుత్వ- ప్రైవేటు కార్యాలయాల దగ్గర, కాలేజీల దగ్గర, స్కూల్లో దగ్గర సంబంధిత అధికారులు మన జాతీయ మువ్వన్నెల జెండాను జెండాను ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ జి.సుభద్రమ్మ, ఎస్సై పి.తిరుపాలు, ప్రిన్సిపాల్ లు వి.ఎం.వెంకటేశ్వర్లు, ఎం.రాజ్యలక్ష్మి, టిడిపి బిసి సెల్ మండల అధ్యక్షుడు కంభం.మోహన్ గౌడు, సొసైటీల చైర్మన్లు సి.గోవిందు, వాడాల జనార్దన్ రెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, నీటి సంఘం అధ్యక్షుడు జీ.తిమ్మారెడ్డి, బిజెపి మండల అధ్యక్షుడు ఆర్.మురళీమోహన్, గ్రంథాలయ అధికారి సీ.వీ.కృష్ణారెడ్డి తదితరులు మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన ఎందరో మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ, భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుతూ, పరస్పర గౌరవం, దేశభక్తి విలువలను పెంపొందిస్తూ అసమానతలు లేని శాంతి, సౌభ్రాతృత్వాలతో బలమైన ప్రజాస్వామిక భారతదేశ నిర్మాణమే సమరయోధుల త్యాగాలకు నిజమైన నివాళులర్పించారు. పౌరులందరికీ సమన్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వంతో 80వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న ఈ శుభసందర్భంగా నవ భారత నిర్మాణం కోసం ప్రతి పౌరుడు కర్తవ్యనిష్టతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహాసిల్దార్ షేక్.పఠాన్ బాబు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ డి.ఖాజాబీ, వెటర్నరీ డాక్టర్ పి.భాస్కర్, పాములపాడు సొసైటీ సీఈవో ఎస్.లక్ష్మణ్ నాయక్, మద్దూరు సొసైటీ సీఈవో ఎస్.ముర్తుజా అలీ, హెడ్ కానిస్టేబుల్ షేక్షావలి, కానిస్టేబుల్ పి.కృష్ణ నాయక్, వీఆర్వోలు మహబూబ్ సాహెబ్, శివన్న, రాముడు, మగ్బూల్, తదితర విఆర్వోలు, వీఆర్ఏలు, మండల రేషన్ డీలర్ల అధ్యక్షుడు జి.నాగభూషణరావు, కార్యవర్గ సభ్యులు ఎస్.హుస్సేన్ సాహెబ్, ఎం.సునీల్ కుమార్, టి.పద్మావతి, వి.సుధాకర్ రావు ఎం.శేఖర్ ఎస్.సంజన్న, ఆర్.యేసు రత్నమ్మ, టి.శేషఫణి, కంప్యూటర్ ఆపరేటర్ తుపాకుల.అశోక్, మద్దూరు మెడికల్ షాప్ దూదేకుల చిన్న హుస్సేన్, సొసైటీ డైరెక్టర్లు వీరకృష్ణుడు, బి.అరుణమ్మ, సిబ్బంది జి.కిరణ్, వేంపెంట ఎంపీటీసీ బోనాల నాగలక్ష్మమ్మ, నీటి సంఘం వైస్ ప్రెసిడెంట్ (డీసీ)ఆల్ఫ్రైడ్, ముద్దపాటి ప్రసాద్, యువరాజు, రత్నాకర్, చిన్నస్వామి ఆచారి, జనసేన శేషు, బోనాల భాస్కర్, దావీదు, సచివాలయ సిబ్బంది, హరిత రాయబారులు, పాములపాడు నాయకులు భూమా రాములమ్మ, మేకల.రాజశేఖర్, బిజెపి సీనియర్ నాయకుడు చల్లా దామోదర్ రెడ్డి, ఆయా కాలేజీల అధ్యాపకులు, పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News