Monday, 14 September 2026 07:27:46 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

రోడ్డు భద్రత, నేరాల నియంత్రణపై అవగాహన కల్పించిన ఆత్మకూరు డిఎస్పి- ఆర్.రామాంజి నాయక్

Date : 14 January 2026 09:14 PM Views : 184

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : జిల్లా ఎస్పీ సునీల్ షేరాన్ ఆదేశాల మేరకు ఆత్మకూరు డిఎస్పి-ఆర్. రామంజి నాయక్, ఆత్మకూరు రూరల్ సి.ఐ- ఎం.సురేష్ కుమార్ రెడ్డి, మరియు పాములపాడు ఎస్సై- పి.తిరుపాలు ల ఆధ్వర్యంలో మండల కేంద్రమైన పాములపాడులో గ్రామసభ నిర్వహించడమైనది. ఈ సందర్భంగా ఆత్మకూరు డిఎస్పి- ఆర్.రామాంజి నాయక్, రూలర్ సిఐ ఎం.సురేష్ కుమార్ రెడ్డి, ఎస్సై- పి.తిరుపాలు లు గ్రామ సభలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ రోడ్డు భద్రతపై పంచసూత్రాలు అయిన హెల్మెట్ తప్పని సరిగా ధరించాలని, సీట్ బెల్ట్ తప్పని సరిగా ధరించాలని, మద్యం త్రాగి వాహనము నడపరాదని,సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయరాదని,ఓవర్ లోడ్ ఆటోలలో ప్రయాణం చేయరాదని, తెలియజేయడం జరిగింది. మీరు నడుపు వాహనములకు ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని, నడిపే వ్యక్తికి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. ఆన్లైన్ గేమ్స్, ఆన్లైన్ లోన్స్, ఆప్స్, ఓటిపి ల గురించి, ఆన్లైన్ ట్రాన్సక్షన్స్, ఆన్లైన్ లో ఎవరైనా ఉద్యొగం ఇప్పిస్తామని చెబితే నమ్మవద్దని, అలాగే తెలిసినవారు ఎవరైనా ఉద్యోగం ఇప్పిస్తామంటే నమ్మవద్దని, స్వయంకృషిని నమ్ముకోవాలని తెలియజేయడం జరిగింది. మహిళలపై జరిగే నేరాలు గురించి, బాల్య వివాహాలు గురించి అవగాహన కల్పించడం జరిగింది. దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు జరుగుతున్నాయి కాబట్టి విలువైన ఆభరణములు, వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండవలెనని, ఒంటరిగా వెళ్లకూడదని హెచ్చరిక చేశారు. రైతులు పంట పొలాలకు మందులు కొట్టేటప్పుడు తప్పనిసరిగా నోటికి గుడ్డ కట్టుకోవాలని లేదా మాస్క్ వేసుకోవాలని తెలియజేయడం జరిగింది. లేనట్లయితే ఆ మందు పిచికారి చేసేటప్పుడు గాలిపీల్చి అస్వస్థకు గురవుతారన్నారు. ఇటీవల కాలంలో కొన్ని కుటుంబ కలహాలతో, అప్పులు అని ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం తప్పక ఉంటుందని కనుక ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకోకూడదని అన్నారు. మీరు చేసుకున్న అప్పులకు, గొడవలకు పూర్తి కుటుంబాన్ని ఆత్మహత్యలకు ఉసిగొల్పకూడదని, బలవంతంగా ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రేరేపించడం మహాపాపమన్నారు. మీకు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసి, సమస్యను పరిష్కరించుకోవాలని తెలియజేయడం జరిగింది. ఇటీవల కాలంలో పిల్లలు సెల్ ఫోన్ వినియోగం ఎక్కువైందని, తల్లిదండ్రులు పిల్లలు పట్ల జాగ్రత్తగా ఉండాలని, సెల్ ఫోన్లు ఇవ్వకుండా చూడాలన్నారు. ఏ సెలవులు వచ్చినా కూడా పిల్లలు ఈతకు కె.సి. కెనాల్, తెలుగు గంగ, వాగులు, వంకలు మరియు బావుల వద్దకు వెళుతున్నారని, ఇది ప్రమాదకరమన్నారు. కనుక పిల్లలు ఎక్కడకు వెళుతున్నారనేది పెద్దలు (తల్లిదండ్రులు) గమనించాలన్నారు. పిల్లలు మీరు ఎక్కడికి వెళ్లాలన్న తల్లిదండ్రులకు చెప్పాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: