ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అనంతపురం : రాష్ట్రంలో బాలికల విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తూ ప్రత్యేక కృషి చేస్తోందని శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర రెడ్డి తెలిపారు. శనివారం ఆత్మకూరులోని, సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన ఆయన, విద్యార్థినులకు అవసరమైన నిత్యోపయోగ వస్తువుల కిట్లను పంపిణీ చేశారు. ప్రభుత్వ బాలికల వసతి గృహాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ట్రంక్ బాక్స్, ప్లేట్, గ్లాస్, బెడ్ షీట్, కార్పెట్, టర్కీ టవల్, స్వెట్టర్, నైట్ డ్రెస్ తదితర ముఖ్యమైన వస్తువులతో కూడిన కిట్లను ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి స్వయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థినులకు పరిశుభ్రమైన తాగునీరు అందించేందుకు తన సొంత నిధులతో త్వరలోనే మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయిస్తానని వెల్లడించారు. అనంతరం విద్యార్థినులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ "విద్యార్థులు చిన్ననాటి నుంచే క్రమశిక్షణ అలవరచుకుని, పట్టుదలతో విద్యను అభ్యసించాలి. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని చదువులో రాణించడం ద్వారా తమ తల్లిదండ్రులకు, చదువుకున్న వసతి గృహానికి మరియు శ్రీశైలం నియోజకవర్గానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దీన్, సాంఘీక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ వెంకట శివారెడ్డి, మున్సిపల్ కమిషనర్ బేబీ, ఎంఈవో -2 ఆయుబ్, సహాయ సాంఘీక సంక్షేమ అధికారి కేసీ రాముడు, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పి. అంజన్న, సుధారాణి, రాజు, రాజారావు, టిడిపి జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు కలీముల్లా, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ నజీర్,మండల పార్టీ అధ్యక్షలు రవీంద్ర బాబు, క్లస్టర్ ఇంచార్జ్ రాజారెడ్డి, దినకర్ నాయకులు శివ ప్రసాద్ రెడ్డి, అబ్దుల్లాపురం బాషా, నాఘుర్ ఖాన్, కొప్పరపు రవి ప్రసాద్, శరత్, నబీ, సుల్తాన్, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News