ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : నంద్యాల జిల్లా, ఆత్మకూరు పట్టణంలో పి ఆర్ టీ యూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్థానిక థెరీసా జూనియర్ కాలేజీ నందు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్టు ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ చాంద్ బాష తెలిపారు. సుశ్రుత ఫౌండేషన్, ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ హైదరాబాద్ వారి సౌజన్యంతో వేరికో వీన్స్ మరియు ఇతర సంబంధ వ్యాధులకు హైదరాబాద్ నుండి ప్రముఖ డాక్టర్లు వచ్చి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందజేస్తారు అని అన్నారు. ఉచిత వైద్య శిబిరానికి సంబంధించిన బ్రౌచర్ ను థెరీసా విద్యా సంస్థల అకాడమిక్ డైరెక్టర్ సాయి ప్రణీత్, పి ఆర్ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం ఆవిష్కరించారు. ఈ అవకాశాన్ని ఆత్మకూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు ఆత్మకూరు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సి.ప్రదీప్ కుమార్, జి.హనుమంతు, రాష్ట్ర నాయకులు పి.నూర్ మొహమ్మద్, హుస్సేన్ సాహెబ్, దామరేకుల రవి, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ఎం.చంద్రశేఖర్, పాములపాడు మండల అధ్యక్షుడు ఎ.సాంబ శివుడు, మండల, జిల్లా కార్యవర్గ సభ్యులు సలీం, ఖాజా, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News