Tuesday, 15 September 2026 01:29:56 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

ఆత్మకూరు డిగ్రీ బాలికల వసతి గృహం వార్డెన్ పై చర్యలు తీసుకోండి

జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబరు లింగాల నాగరాజు

Date : 20 November 2025 10:14 PM Views : 1167

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు డిగ్రీ బాలికల వసతి గృహం వార్డెన్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు ప్రభుత్వాన్ని, ఉన్నతాధికారులకు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆత్మకూరులోని, డిగ్రీ బాలికల వసతి గృహాన్ని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్- ఎల్.నాగరాజు, ఎమ్మార్పీఎస్ నాయకులు కే.నాగన్న తో కలిసి సందర్శించి మాట్లాడుతూ సోమవారం మొదులుకొని శుక్రవారం వరకు రోజు ఉదయం ఉడకబెట్టిన కోడిగుడ్డు ఇవ్వాల్సి ఉన్న ఇవ్వకుండా పిల్లల నోర్లు కొడుతున్నారని ఆయన మండిపడ్డారు. పెరుగుకు బదులు పలచని మజ్జిగ పోస్తున్నారని పిల్లలు పలచటి చారు, పెరుగుకు బదులు పలచని మజ్జిగ పెడుతున్నారని, అది తినలేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. మెనూ ప్రకారం ఆహారం ఏది సరిగ్గా ఇవ్వడం లేదని ఆయన అన్నారు. నాలుగు బాత్రూములు ఉంటే రెండు బాత్రూంలలో మాత్రమే నీరు వస్తుందని, 9 రూములలో ఒక్క రూములో మాత్రమే కరెంటు ఉందని, ఆ రూములోనే పిల్లలందరూ రాత్రివేళ నిద్రించడానికి సరైన సౌకర్యం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ వార్డెన్ మాత్రం ఏ ఒక్కరోజు కూడా హాస్టల్ కు రావడం లేదని ఆయన మండిపడ్డారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల బాగా చదువుకుంటారని తల్లిదండ్రులు తమ పిల్లలను హాస్టల్లో వదిలితే ఎవరు ప్రశ్నించరని వార్డెన్లు వాళ్ల ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. జిల్లాలో ఏ ఒక్క హాస్టల్లో పిల్లలకు సరైన భోజనం పెట్టకుండా, సరిగ్గా చూసుకోకపోయినా వార్డెన్లను వదిలే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. దీనిపై వెంటనే జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :