Saturday, 12 September 2026 09:29:09 PM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలనీ ఎమ్మెల్సీ డాక్టర్ గాదె శ్రీనివాసులు నాయుడుకు వినతిపత్రం సమర్పించిన పి ఆర్ టి యు రాష్ట్ర, జిల్లా నాయకులు

Date : 09 November 2025 05:47 PM Views : 1338

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుటలో రాష్ట్ర సంఘంగా తగు ప్రాతినిధ్యం వహించి ఉపాధ్యాయ సంక్షేమం కోసం కృషి చేయాలని, ఏపీ పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ పక్షాన పి ఆర్ టి యు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో, వివిధ ఉపాధ్యాయ సమస్యలపై ప్రాతినిధ్యం వహిస్తున్న నంద్యాల జిల్లా శాఖ ఆంధ్రప్రదేశ్ పి ఆర్ టి యు రాష్ట్ర నాయకత్వం ఎమ్మెల్సీ- డాక్టర్ గాదె.శ్రీనివాసులు నాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి ఏ. ఎం.గిరిప్రసాద్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వి.కరుణానిధి మూర్తి, లకు వివిధ ఉపాధ్యాయ సమస్యలపై ప్రాతినిధ్యం వహించి, రాష్ట్ర సంఘానికి సభ్యత్వ నమోదు రుసుము అందజేయడం జరిగింది. టిఆర్టియు నంద్యాల జిల్లా అధ్యక్షుడు వై.రాంపక్కి రెడ్డి, ప్రధాన కార్యదర్శి సయ్యద్.చాంద్ బాష, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్.వి.భాస్కర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు కె.కృష్ణారావు, విజయ రావు, పి.నూర్ మొహమ్మద్, రమణయ్య, హుస్సేన్ సాహెబ్, సుమియన్, జగదీష్, గోస్పాడు మండల నాయకులు రాజశేఖర్, శ్రీను, షడ్రక్, అహ్మద్ హుస్సేన్ తదితరులు. పలు సమస్యలు రాష్ట్ర సంఘానికి ప్రాతినిధ్యం వహించి పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవి ఉమ్మడి సర్వీస్ రూల్స్ సాధించి, పంచాయతీ రాజ్ ఉపాధ్యాయులకు పర్యవేక్షణ పోస్టులైన ఎంఈఓ, డివైఈవో, డిఐఈడి లెక్చరర్ తదితర పోస్టులలో పదోన్నతి పొందడానికి అవకాశం కల్పించాలని, 2011 కంటే ముందు నియమింపబడ్డ ఉపాధ్యాయులకు టెట్ నుంచి పూర్తి మినహాయింపు ఇవ్వాలనీ, అందుకు తగిన కార్యాచరణ రూపొందించాలనీ, డీఎస్సీ- 2003 ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో-57 ప్రకారం పాత పెన్షన్ అమలు చేయాలనీ, సిపిఎస్ రద్దు చేయించి, 01.09.2004 తర్వాత నియామకం పొందిన వారిని అందరికీ పాత పెన్షన్ వర్తించేలా చేయాలనీ, స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజ్) పదోన్నతులు చేపట్టనందున, ఆ పోస్టులను అర్హులైన సెకండరీ గ్రేడ్ టీచర్ లకు పదోన్నతులు కల్పించాలనీ, ఖాళీగా వున్న జిఆర్- II హెచ్ ఎం, స్కూల్ అసిస్టెంట్ (సబ్జెక్ట్) మరియు నూతనంగా క్రియేట్ చేసిన స్కూల్ అసిస్టెంట్ (స్పెషల్ ఎడ్యుకేషన్) పోస్టులను అర్హులైన సెకండరీ గ్రేడ్ టీచర్ లకు పదోన్నతులు కల్పించాలనీ, స్కూల్ అసిస్టెంట్ (హిందీ) పోస్టులు పెంచాలనీ, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ రూపొందించి, వారి సమస్యలు పరిష్కరించాలనీ, కేజీబీవీ టీచర్లకు ఎంటిఎస్ వర్తింపచేయాలి వారి ఇతర సమస్యలు పరిష్కరించాలనీ, ఎం టి ఎస్ ఉపాధ్యాయులైన డీఎస్సీ- 2008 & 1998 వారిని రెగ్యులైజ్ చేయాలి. వారికి 12 నెలల వేతనం చెల్లించాలనీ, పి ఆర్ సి కమిషన్ ఏర్పాటు, 30% మధ్యంతర భృతి (ఐ ఆర్), పెండింగ్ డి ఎ లు, ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థిక బకాయిలు చెల్లించాలనీ, సిపిఎస్ వారికి పాత డి ఎ బకాయిలు చెల్లించాలనీ, ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ కంటే ఆరోగ్య శ్రీ మెరుగుగా ఉందని, దీని స్థానంలో హెల్త్ ఇన్సూరెన్స్ కింద అన్ని రకాల చికిత్సలకు ఉచిత వైద్యం అందించాలనీ, 2026 క్యాలెండర్ ఇయర్ లో ఆప్షనల్ హాలిడేస్ వ్యక్తిగతంగా కాకుండా, పాఠశాల యూనిట్ గా వాడుకోవడానికి అనుమతి ఇవ్వాలనీ, విద్యాహక్కు చట్టం ప్రకారం పాఠశాల పనిదినాలు 220 ఉంటే సరిపోతుందని సూచించినపుడు, ప్రత్యేక పరిస్థితుల్లో ఇచ్చిన సెలవులు కూడా పరిహారంగా పనిచేయాలనే విధానం స్పష్టత ఇవ్వాలనీ, ఏకోపాధ్యాయ పాఠశాలలు లేకుండా ప్రతి పాఠశాలకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులను కేటాయించాలనీ, 2025 బదిలీల్లో బదిలీ అయ్యి రిలీవర్ లేక పాత స్థానాల్లో కొనసాగే వారిని రిలీవర్ తో సంబంధం లేకుండా రిలీవ్ చేయాలనీ, వారి స్థానాలను అకడమిక్ ఇన్స్ట్రక్టర్ ల ద్వారా భర్తీ చేయాలనీ, గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో పనిచేసే రెసిడెన్షియల్ ఉపాధ్యాయులకు పదవీ విరమణ వయస్సు 62 కు పెంచాలనీ, మున్సిపల్ మరియు ఎయిడెడ్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలనీ, ఉపాధ్యాయులపై ఒత్తిడి పెంచే పరీక్ష విధానం మార్పు చేయాలనీ, వివిధ యాప్ లను తొలగించాలనీ, క్లస్టర్ సమావేశాలను హాఫ్ డే కాకుండా, పూర్తి రోజు నిర్వహించాలి. సబ్జెక్ట్ టీచర్స్ కాంప్లెక్స్ ను మండల స్థాయిలో నిర్వహించాలనీ, గిరిజన సంక్షేమ పాఠశాలల్లో పనిచేసే రెసిడెన్షియల్ కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులైజ్ చేయాలనీ, కొన్ని పాఠశాలలు 1-10 తరగతులు నిర్వహిస్తున్నారు, వాటిలోని మోడల్ ప్రైమరీ పాఠశాలను వేరు చేసి వేరే డైస్ కోడ్ ఇవ్వాలనీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర సంఘాన్ని కోరారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :