Sunday, 13 September 2026 03:29:36 AM
# నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్

కులం లేని సమ సమాజం కోసం పోరాడుదాం

దళిత కాలనీలలో మౌలిక వసతులు కల్పించాలని డిటి- పఠాన్ బాబుకు వినతిపత్రం సమర్పించిన ప్రజాసంఘాల నాయకులు

Date : 04 August 2026 10:39 PM Views : 90

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : సమాజంలో కుల వివక్షత లేని సమ సమాజం కోసం పోరాడాలని కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు డి.స్వామన్న, వ్యవసాయ  కార్మిక సంఘం నాయకులు ఎస్.బాలయ్య పిలుపునిచ్చారు. స్థానిక మండల రెవెన్యూ కార్యాలయం ముందు మంగళవారం ధర్నా నిర్వహించి, అనంతరం వినతి పత్రాన్ని డిప్యూటీ తహాసిల్దార్-పఠాన్ బాబు, రెవిన్యూ ఇన్స్పెక్టర్-డి.ఖాజాబీ లకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్రానంతరం కొంతవరకు వచ్చిన మార్పుల వల్ల కుల వివక్షత ఇంకా పోలేదని అది అనేక రూపాలలో నేటికీ కొనసాగుతుందనీ, అనేక ప్రాంతాలలో పెత్తందారి వ్యవస్థ బుసలు కొడుతున్నదన్నారు. నేటికీ దళితులు సమాజంలో  కుల వ్యవస్థ ను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల స్మశాన వాటిక సమస్యల పరిష్కారం కోసం ఇచ్చిన జీవో 1235 అమలు చేయాలన్నారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార కేసుల్లో పోలీసుల నిర్లక్ష్యం వహిస్తూ పెత్తందారులు కొమ్ముకాస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే జస్టిస్ పుల్లయ్య కమిషన్ సిఫారసులను అమలు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దళిత సమస్య ఒక కులానికి మాత్రమే కాదని అది సామాజిక రుగ్మత అని వారు పేర్కొన్నారు. దళితుల స్మశాన వాటికలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. కులం పునాదుల మీద ఒక జాతిని గాని, ఒక నీతిని గాని, దేశాన్ని గాని నిర్మించలేరని ఎవరైనా ఆ విధంగా పూనుకుంటే అది విఫలం కాక తప్పదని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చెప్పిన మాటలను గుర్తు చేశారు. దళిత కాలనీలో మంచినీరు, రోడ్లు, వీధిలైట్లు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం, ఏర్పాటు చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘ నాయకులు నల్లమల అబ్రహం, పురుషోత్తం, రంగస్వామి, ఏసేపు, ఆనంద్, బాలయేసు, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :