ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు మండల పరిధిలోని, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆత్మకూరు సబ్ బ్రాంచ్ నకు మండల కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కి ఆత్మకూరు మండల తహసిల్దార్- జి.రత్న రాధికను అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. చైర్మన్ గా ఎన్.వెంకటేశ్వర్లు ను, వైస్ చైర్మన్ గా ఎం.మక్బుల్ భాష ను, సెక్రెటరీగా గోపాలకృష్ణ, జాయింట్ సెక్రెటరీగా వి.శ్రీనివాసులు, ట్రెజరర్ గా ఎం.నాగేశ్వరరావు లను, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా ఖయ్యూం భాష, శ్రీకాంత్ ఆచారి, లింగస్వామి, వై.చిన్న శివయ్య, పి.అలీ భాష, ఎస్.ఇబ్రహీం లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం అధ్యక్షులుగా ఎంపికైన తహాసిల్దార్ జి.రత్నరాధిక కు శాలువా కప్పి, పుష్పగుచ్చం చేతికి అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐ ఆర్ సి ఎస్ డిస్టిక్ చైర్మన్ దస్తగిరి, ఐఆర్సిఎస్ డిస్టిక్ ట్రెజరర్ డి.నాగేశ్వరరావు, ఆర్ఎంపీ మండల ప్రెసిడెంట్ చింతలయ్య లు పాల్గొన్నారు.
Admin
E Nivas News