Friday, 11 September 2026 10:13:35 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

చిన్నారిపై అమానుస్యంగా ప్రవర్తించిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి జుడిషియల్ కస్టడీ కి తరలించాము

ఆర్.రామాంజి నాయక్(డి.ఎస్.పి)

Date : 18 August 2026 09:57 PM Views : 382

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు మండలంలోని, కొట్టాలచెరువు గ్రామంలో తొమ్మిదేళ్ల చిన్నారిపై జరిగిన అమానుష ఘటనపై డీఎస్పీ-ఆర్.రామాంజీ నాయక్ ఆద్వర్యంలో ఆత్మకూరు పోలీసులు అత్యంత వేగంగా, సమర్థవంతంగా స్పందించారు. ఈ సందర్భంగా డిఎస్పి ఆర్.రామాంజి నాయక్ మాట్లాడుతూ కేవలం అంగట్లో దొంగతనం చేసిందనే తీవ్ర అనుమానంతో చిన్నారిని అక్రమంగా నిర్బంధించి, తాడుతో కట్టేసి హింసించిన నిందితుల ఆటకట్టించారు. ఘటన జరిగిన విషయాన్ని తెలుసుకున్న వెంటనే చిన్నారి తల్లి కడమంచి గంగమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో ఆత్మకూరు అర్బన్ సీఐ, ఎస్ఐ లు మరియు సిబ్బంది తక్షణమే రంగంలోకి దిగారు. కేసు తీవ్రతను గుర్తించిన పోలీసులు, నిందితులు పరారవ్వక ముందే గంటల వ్యవధిలోనే పక్కా సమాచారంతో మెరుపు దాడి చేశారు. కురుకుంద రోడ్డులోని, ఇటుకల బట్టీ దగ్గర దాక్కున్న ప్రధాన నిందితులు రాజు నాయక్ (ఎ1), మల్లు నాయక్‌ (ఏ2)లను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు తొమ్మిదేళ్ల మైనర్ బాలిక కావడం, పైగా బాలిక గుర్తింపు బయటపడేలా వీడియో చిత్రీకరించడాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు నిందితులపై బిఎన్ఎస్ సెక్షన్లతో పాటు జువైనల్ జస్టిస్ (జెజె) యాక్ట్ కింద కేసులు నమోదు చేసి, వారిని కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఘటన జరిగిన వెంటనే నిందితులను అరెస్ట్ చేసి, చిన్నారి కుటుంబానికి అండగా నిలిచిన ఆత్మకూరు పోలీసుల తక్షణ చర్యలపై స్థానికులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, బాధితురాలు మైనర్ కావడంతో ఆమె ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు అర్బన్ సీఐ- మహేశ్వర్ రెడ్డి, రూలర్ సిఐ ఎం.సురేష్ కుమార్ రెడ్డి, ఎస్సైలు డీవి.నారాయణరెడ్డి, రఘు రామయ్య గౌడు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, తదితరులు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: