ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, జూటూరు గ్రామంలో రైతు "వ్యవసాయ శాఖ మరియు అనుబంధ శాఖల" ఆధ్వర్యంలో నిర్వహించిన రైతన్నా - మీకోసం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని రైతుల ఇంటింటికి తిరిగి రైతన్నా-మీకోసం పాంప్లెట్ పేపర్ లు పంపిణీ చేస్తూ కూటమి ప్రభుత్వంలో రైతులకు అండగా అమలుచేసిన పథకాల గురించి ప్రభుత్వ అధికారులు, నాయకులతో కలిసి నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త.జయసూర్య అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే-గిత్త.జయసూర్య మాట్లాడుతూ సంక్షోభం నుంచి సంక్షేమం దిశగా: సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ప్రతి హామీని అమల్లోకి తెచ్చాం అన్నారు. 17 నెలల కాలంలో సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేశాం. తల్లికి వందనం, స్త్రీ శక్తి ఉచిత బస్సు, దీపం-2, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, 20 లక్షల ఉద్యోగాలు, మెగా డిఎస్సీ, అన్నదాత సుఖీభవ వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం అన్నారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా జూటూరు గ్రామానికి చెందిన జి.చంద్రకళ కి 15860 /- రూపాయలు చెక్కును ఎమ్మెల్యే గిత్త.జయసూర్య అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సై- కే.సురేష్ బాబు, ఎంపీడీవో-ఎన్.చంద్రశేఖర్, మండల కన్వీనర్- జి.రవీంద్రారెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ హరినాథ్ రెడ్డి, సీనియర్ నాయకులు తిమ్మారెడ్డి, బండ్లమూరి.వెంకటేశ్వరరావు, టిడిపి బిసి సెల్ మండల అధ్యక్షుడు- కంభం.మోహన్ గౌడ్, మిట్టకందాల మాజీ సర్పంచ్ జి.హరి ప్రసాద్ యాదవ్, జూటూరు నాయకులు నాయిని.మధు, నాయిని.ఉపేంద్ర, యూనిట్ ఇంచార్జ్ రాము, రామకృష్ణ, పూసల కృష్ణ, మద్దిలేటి, రామస్వామి, అర్జున్ గౌడ్, పాములపాడు సొసైటీ చైర్మన్-రాయపాటి.గోవిందు, రుద్రవరం సురేష్, తెలుగు యువత మండల అధ్యక్షుడు-షేక్.కరీంబాష, లింగాల సర్పంచ్ మల్లేశ్వర్ రెడ్డి, జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్- లింగాల.నాగరాజు, శంకర్ గౌడ్, యేసేపు, అల్లిసాహెబ్, తుమ్మలూరు సర్పంచ్ వి.వరప్రసాద్, మేకల.రాజశేఖర్, నాగలక్ష్మి రెడ్డి, ఐటీడీపి రమేష్ నాయక్, ఇబ్రహీం, మనోహర్, ప్రేమరాజు, లింగాల స్వాములు, అగ్రికల్చర్ అధికారి ఎం.వి.మహేశ్వర్ రెడ్డి, ఈ ఓ పి ఓ ఆర్ డి-సులోచన, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News