ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : "మీ భూమి–మీ హక్కు" కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లాలోని, బనగానపల్లెకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, సహచర ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులు, జిల్లా అధికారులతో కలిసి హెలిప్యాడ్ వద్ద ఎమ్మెల్యే గిత్త.జయసూర్య ఘన స్వాగతం పలకడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు నందికొట్కూరు నియోజకవర్గంలోని, సమస్యలపైన గిత్త.జయసూర్య వినతి పత్రం సమర్పించడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంట రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి బీసీ.జనార్దన్ రెడ్డి, నంద్యాల జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గణియా, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News