Wednesday, 29 July 2026 11:36:05 PM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

కే.నాగరాజును ఘనంగా సన్మానించిన మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి అంకన్న

Date : 25 February 2026 10:09 PM Views : 244

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : మండల కేంద్రమైన పాములపాడుకు చెందిన నిత్య సమాజ సేవకుడు కలబండి.నాగరాజుకు ఆయన చేసిన సామాజిక సేవకు గుర్తింపుగా మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి.అంకన్న ఆధ్వర్యంలో ప్రజా సంఘాల నాయకులు డీవీఎంసీ మెంబర్ లింగాల.నాగరాజు, జాతీయ బీసీ సంఘం మండల అధ్యక్షుడు రాయపాటి మురళీమోహన్, ముస్లిం మైనార్టీ సంఘం మండల అధ్యక్షుడు ఎస్.షేక్షాఅలి, బీసీ సంఘం నాయకుడు జి.సాయి కృష్ణ, సేవా భారతి (వై.ఆర్.డి.ఎస్) అధ్యక్షుడు ఎస్.షర్ఫద్దీన్ అలి, తదితర నాయకులతో కలిసి శాలువా కప్పి, పూలమాల మెడలో వేసి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కే.అంకన్న, డీవీఎంసీ మెంబర్ ఎల్.నాగరాజు, ముస్లిం మైనార్టీ సంఘం మండల అధ్యక్షుడు ఎస్.షేక్షాఅలీ, జాతీయ బీసీ సంఘం మండల అధ్యక్షుడు ఆర్.మురళీమోహన్, బీసీ సంఘం నాయకుడు జి.సాయి కృష్ణ, సేవా భారతి (వై ఆర్ డి ఎస్) అధ్యక్షుడు ఎస్.షర్ఫద్దీన్ అలి, తదితర నాయకులు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా కే.నాగరాజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల అభ్యున్నతి కొరకు, చెంచు గిరిజనుల జీవనోపాధి కొరకు అధికారులతో, ప్రజా ప్రతినిధులతో వినతి పత్రాలు అందించి ఉపాధి హామీ పనులను కల్పించడం, వారికి నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం, వారికి ఆర్థిక సహకారం అందించడం, మతసామరస్యం కోసం, స్వాతంత్రం కోసం, విముక్తి కోసం కృషిచేసిన మహానుభావుల జయంతిలు, వర్ధంతిలు నిర్వహించి ప్రజలను చైతన్యపరచడం వంటి అనేక అనేక సమాజ సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. ప్రేమ వివాహాల సమస్యలను, కుటుంబాల సమస్యలను, ఆస్తుల సమస్యలను ఒక పెద్ద మనిషిగా ఆయన సామరస్యంతో పరిష్కారం చేయడం జరిగిందన్నారు. మొత్తానికి సమాజ సేవకుడు కె.నాగరాజు బహుజనుల రాజ్యాధికారం కొరకు కృషి చేయడం అనేది అందరికీ ఆదర్శమన్నారు. కనుక మనమందరము ఆయన మాదిరిగానే కులమతాలకతీతంగా, రాజకీయాలకతీతంగా, మానవత్వంతో, మతసామరస్యంతో కలిసి వెలిసి ఉండి, ఏకమై ఈ దేశంలో రాజ్యమేలుతున్న మూఢనమ్మకాలను, మూఢాచారాలను, వివక్షతలను రూపుమాపి నియంతల పాలనకు స్వస్తి పలకాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు తేనె మల్లికార్జున, మైమాకర్, ప్రసాద్, శాలు భాష, చిన్న ఈశ్వరయ్య, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: