ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : నేడు నంద్యాల జిల్లా శాఖ 2026 నూతన క్యాలెండర్, పి ఆర్ టి యు ఏపీ డైరీ లను రాష్ట్ర న్యాయ & మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి- ఎన్ఎండి.ఫరూక్, పిఆర్టియు నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఎన్.వి.భాస్కర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్.చాంద్ బాష, వర్కింగ్ ప్రెసిడెంట్ వై.రాంపక్కి రెడ్డి ల ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ఉపయోగపడే విధంగా, డైరీ, క్యాలెండర్ , టేబుల్ క్యాలెండర్ రూపొందించడం చాల అభినందనీయమని ఈ సందర్భంగా తెలిపారు. 2026 నూతన సంవత్సరం అందరికీ మంచి జరగాలని, అందరూ సంతోషంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని, విద్యాభివృద్ధి కి అందరూ కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కె.కృష్ణారావు, విజయ రావు, గోపాల్ రెడ్డి, దేవనాల శ్రీనివాసులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు వైవీ.రమణయ్య, రాష్ట కార్యదర్శులు పి.నూర్ మొహమ్మద్, ఎ.హనుమంతు, జగదీష్ బాబు, కిరణ్ బాబు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సుమియోన్, హుస్సేన్ సాహెబ్, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మరియు జిల్లా నాయకులు రాజశేఖర్ రెడ్డి, సయ్యద్.మొయినుద్దీన్, ఖాజా, జాఫర్, ఇసాక్, పి.శ్రీనివాసులు, రఘు, నాగేశ్వరయ్య, మధు, సుబ్రమణ్యం, కలాం, ఎం.నర్సయ్య, మహబూబ్ భాష తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News