ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : మండల కేంద్రమైన, పాములపాడులోని విద్యుత్ సబ్ స్టేషన్ నందు శుక్రవారము విద్యుత్ శాఖ యస్ఇ సుధాకర్ కుమార్ నూతన అదనపు 8 ఎంవిఆర్. ట్రాన్స్ ఫార్మర్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా విద్యుత్ శాఖ ఎస్ఈ సుధాకర్ కుమార్ మాట్లాడుతూ ఇదివరకు ఈ సబ్ స్టేషన్ నందు 8 ఎం.వి.ఆర్. పవర్ ట్రాన్స్ ఫార్మర్ ఒకటి 5 ఎం.వి.ఆర్. ఒకటి ఉండగా పాములపాడు మండలంలోని, ప్రజలకు మరియు రైతులకు నిరంతరాయంగా నాణ్యమైన కరెంట్ ను ఇవ్వాలన్న ప్రభుత్వ శంకల్పంతో దాదాపుగా ఒక కోటి, ఇరవై రెండు లక్షల రూపాయలు ఖర్చు చేసి, ఈ నూతన 8 ఎం సి ఆర్ పవర్ ట్రాన్స్ ఫార్మర్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ 8 ఎం.వి.ఆర్. ట్రాన్స్ ఫార్మర్ వలన మండలంలోని, రైతులకు మరియు ప్రజలకు ఎలాంటి లో వోల్టేజి లేకుండా నిరంతరాయంగా విద్యుత్ ను ఇచ్చేందుకు, ఈ 8 ఎంవిఆర్. ట్రాన్స్ ఫార్మర్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని యస్ఇ. సుధాకర్ కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఆపరేషన్ ఈఈ జయశంకర్, ఎమ్ ఆర్ టి. ఈఈ శ్రీరాములు, ఆపరేషన్ డిఈఈ రామసుబ్రమణ్యం, ఎం.ఆర్.టి. డిఈఈ గురు రంగా ఆచార్యులు, పాములపాడు ఏఈ అబ్దుల్లా ఆబిద్ మరియు విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
E Nivas News