ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు ప్రభుత్వ శాఖలలో, అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖలో పనిచేసే విఆర్ఓలపై అధిక పని ఒత్తిడిని తగ్గించి వర్క్ టు రూల్ అమలు చేయాలని వీఆర్వోల సంఘం మండల అధ్యక్షుడు డి.హుస్సేన్ సాహెబ్ అన్నారు. గురువారం మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట విఆర్వోలు నల్ల బ్యాడ్జీలు ధరించి, ధర్నా నిర్వహించి, తహాసిల్దార్- జి.సుభద్రమ్మ కు, మరియు డిప్యూటీ తహాసిల్దార్- పఠాన్ బాబు లకు వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వీఆర్వోల సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా విఆర్వోల న్యాయపరమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. అంతేగాక వర్క్ టు రూల్ జనవరి-12వ తేదీ నుంచి అమలుకు ఒప్పందం చేసుకొని ఇంతవరకు వర్తింప చేయడం లేదని ఇది ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నించారు పొలాల రీ సర్వేలో భాగంగా అధికారులు ఏమైనా పొరపాట్లు చేస్తే వాటికి వీఆర్వోలను బాధ్యులుగా చేయడం సరైనది కాదన్నారు విఆర్ఓలపై అధిక పని ఒత్తిడి కారణంగా కొంతమంది వీఆర్వోలు మానసిక ఒత్తిడికి గురై రోడ్డు ప్రమాదాలకు గురికావడం ఆత్మహత్యలకు పాల్పడడం వంటి సంఘటనలు ఈమధ్య తరచు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వీఆర్వోలపై అధిక పని ఒత్తిడిని తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. ఇటీవల మృతి చెందిన కొంతమంది వీఆర్వోల మృతికి సంతాపాన్ని ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు వీఆర్వోల న్యాయపరమైన సమస్యలు తక్షణమే పరిష్కరించకపోతే రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఉద్యమ పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విఆర్వోలు శివన్న, మూర్తుజావలి, మహబూబ్ బాషా, శ్రీనివాసులు, మద్దిలేటి, పురందరుడు, మక్బుల్ భాష, రాముడు, పి.సామేలు, తదితర పాల్గొన్నారు.
Admin
E Nivas News