Tuesday, 15 September 2026 03:13:21 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

దివికి ఎగసిన బాలీవుడ్ డ్రీమ్ బాయ్, ఏక్షన్ మాన్, హీమాన్, (ధరమ్ జి) ధర్మేంద్ర మృతికి సంతాపం తెలిపిన ప్రముఖులు

Date : 24 November 2025 10:23 PM Views : 448

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అమరావతి : హిందీ చలన చిత్ర పరిశ్రమ సీనియర్ హీరో డ్రీమ్ బాయ్ (1960-1966) ఏక్షన్ హీరో (1966-1977) హిమాన్ (1977-1990) ధర్మేంద్ర సింగ్ డియోల్ (ధర్మేంద్ర,89) మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ సేవా భారతి యూత్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు- ఎస్.షర్ఫద్దీన్ అలి, ముఖ్యమంత్రిలు, ప్రముఖ రాజకీయ నాయకులు, పలువురు సినీ ప్రియులు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ధర్మేంద్ర సింగ్ డియోల్ 1935 లో పంజాబ్ లూథియానాలో జన్మించారన్నారు. ఫిలిం ఫేర్ సినీ ప్రతిక నిర్వహించిన స్టార్ హంట్ ద్వారా సీనియర్ హీరో బలరాజ్ సహానీ హీరో గా నిర్మితమైన దిల్ తెర హంభీ తెర చిత్రం ద్వారా సైడ్ హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యారన్నారు. అనంతరం హకీకతు (1964) చిత్రంలో దేశం కోసం పోరాటం చేసే ఒక సైనికుడుగా నటించి మెప్పించారన్నారు. 1966లో మీనా కుమారి కథానాయికగా నటించగా విడుదల అయిన ఫూల్ ఆర్ పత్తర్ చిత్రంలో కథానాయకుడిగా నటించి ఒక మంచి యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. ఇదే చిత్రం తెలుగులో ఎన్టీఆర్ హీరోగా నిండు మనస్సులుగా రీమేక్ అవ్వడం విశేషం అన్నారు. అనంతరం అదే ఇమేజ్ తో మేర గావున్, యాదోంకి భారత్ (అన్నదమ్ముల అనుబంధం), సీత ఔర్ గీతా(గంగా మంగ), షోలే, చుప్కే చుప్కే, శాలిమార్, బర్నింగ్ ట్రైన్, నౌకరు బీవీ క, రామ బల్ రామ్,తదితర చిత్రాలలో యాక్షన్ హీరోగా నటించి మెప్పించారన్నారు. ధరమ్ వీర్ (సింహబలుడు), సామ్రాట్, లోహ, హుకుమత్, సోని పే సుహాగ్, రాజ్ తిలక్, షెహజాదే, కత్రోంక కిలాడి, (సింహస్వప్నం), దుష్మాన్ దేవత, బట్వార, జాన్ హాతేలి పే, తదితర చిత్రాలలో హీమాన్ హీరోగా నటించి ప్రేక్షకులను మెప్పించారన్నారు. 1970 వ దశకంలో ధర్మేంద్ర, హేమామాలిని ఒక సూపర్ హిట్ జంటగా పేరు తెచ్చుకున్నారు. 2012 లో పద్మ భూషణ్ అవార్డ్ అందుకోవడం జరిగిందన్నారు. ఆల్ ఇండియా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తో తొలి సారిగా 1975 లో నటించారు. చుప్కే చుప్కే, షోలే చిత్రాలలో నటించారు. రెండు సినిమాలు హృషి కేశ ముఖర్జీ, రమేష్ సిపి దర్శకత్వంలో నిర్మించబడ్డాయి. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర సూపర్ హిట్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్నారు. తన చివరి సినిమాగా కరణ్ జోహార్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ అలియాభట్ జంటగా నటించిన రాకీ ఔర్ రాణికి ప్రేమ్ (2023) చిత్రంలో నటించారు. తన యొక్క 60ఏళ్ల సినిజీవితంలో 300 చిత్రాలలో నటించారు. అతి ఎక్కువ మల్టీ స్టార్ చిత్రాలలో నటించిన హీరోగా కూడా ధర్మేంద్ర పేరు తెచ్చుకున్నారు. ఇండియన్ షో మ్యాన్ రాజకపూర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మేర నామ్ జోకర్ సినిమాలో సర్కస్ ప్లేయర్ ధర్మేంద్ర నటించి మెప్పించారు. హిందీ ప్రముఖ హీరో ధర్మేంద్ర మృతికి ఆంధ్ర ప్రదేశ్ సేవా భారతి యూత్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు- ఎస్.షర్ఫద్దీన్ అలి, మరియు పలువురు రంగస్థల కళాకారులు, సినీ అభిమానులు పైవిధంగా తమ యొక్క ఘన నివాళి సందేశంలో పేర్కొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: