ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు పట్టణంలోని, విద్యుత్ భవన్ లో డా.సిద్ధారెడ్డి కంటి వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఉచిత కంటి పరీక్ష శిబిరాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని క్యాంపు నిర్వాహకులు కోరారు. మంగళవారం నాడు కర్నూల్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న విద్యుత్ భవన్ లో డా.సిద్ధారెడ్డి కంటి వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో సుమారు 50 మందికి పైగా వైద్య సేవలు ఉపయోగించుకున్నారు. అందులోని కొంతమందికి శస్త్ర చికిత్స అవసరము అని నిర్ణయించి ఆసుపత్రికి రెఫెర్ చేశారు. ఈ సందర్భంగా క్యాంపు నిర్వాహకులు మాట్లాడుతూ డాక్టర్ సిద్ధా రెడ్డి కంటి వైద్యశాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని ఈ శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డా.సిద్ధారెడ్డి కంటి వైద్యశాల సిబ్బంది, విద్యుత్ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.
Admin
E Nivas News