ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : సంక్షేమ హాస్టళ్లకు, గురుకుల పాఠశాలలకు మెస్ ఛార్జీలు 10 శాతం పెంచుతూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డివిఎంసి మెంబర్ ఎల్.నాగరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు కార్పొరేట్ కు దీటుగా నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన సంక్షేమాన్ని అందిస్తుందని పేద విద్యార్థుల తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. గత వైసిపి ప్రభుత్వం హయంలో సంక్షేమ హాస్టల్లో, గురుకుల పాఠశాలలలో కనీస వసతులు లేక సమస్యల వలయంగా ఉండేదని అన్నారు. గత రెండేళ్లలో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొని సంక్షేమ హాస్టల్స్ రూపురేఖలు మార్చి విద్యార్థుల అభ్యున్నతికి సమూల మార్పులు తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అని అన్నారు. పేద విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి చదువులు చదివి, తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఆయన కోరారు.
Admin
E Nivas News