ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, కృష్ణరావుపేట గ్రామంలో నిర్వహించిన "రెండేళ్ల సంక్షేమ – అభివృద్ధి" డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమంలో నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త.జయసూర్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త.జయసూర్య ప్రజలను కలిసి కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించి, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు. ప్రజల ఆశీర్వాదం, విశ్వాసంతో కృష్ణారావుపేట గ్రామం మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే గిత్త.జయసూర్య తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పాములపాడు మండల కన్వీనర్ జి.రవీంద్రారెడ్డి, మండల కార్యదర్శి & మిట్టకందాల గ్రామ మాజీ సర్పంచ్ జి.హరిప్రసాద్ యాదవ్, పాములపాడు సొసైటీ చైర్మన్ సి.గోవిందు, మద్దూరు సొసైటీ చైర్మన్ వాడాల జనార్దన్ రెడ్డి, రాష్ట్ర యాదవ కార్పొరేషణ్ డైరెక్టర్ కడియం వెంకటేశ్వర్లు యాదవ్, డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు, తెలుగు యువత మండల అధ్యక్షుడు షేక్.కరీం భాష, జూటూరు హఫీజ్, పూసల కృష్ణ, లింగాల మాజీ సర్పంచ్ మల్లేశ్వర్ రెడ్డి, చెలిమిల్ల మాజీ సర్పంచ్ ఆదినారాయణ, తుమ్మలూరు మాజీ సర్పంచ్ వరప్రసాద్, ఎస్సై పి.తిరుపాలు, ఎంఈఓ-2 బి.గోపాల్, కూటమి నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
Admin
E Nivas News