ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణంలో 66వ అంతర్జాతీయ దివ్యాంగుల వారోత్సవాలు పట్టణ దివ్యాంగుల సంగం అధ్యక్షుడు ఎన్ఎస్ జిలాని ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆత్మకూరు మండల సింగల్ విండో చైర్మన్- ఏ.షహాబుద్దీన్, టిడిపి మాజీ మండల అధ్యక్షుడు శివప్రసాద్ రెడ్డి తో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ది ఆత్మకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ ఏ.షహబుద్దీన్, టిడిపి మాజీ మండల అధ్యక్షుడు శివ ప్రసాద్ రెడ్డి లు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తరఫున దివ్యాంగుల కొరకు ఏడు వరాలు ప్రకటించడం జరిగిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరడమైనది. అదేవిధంగా మన శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా.రాజశేఖర్ రెడ్డి దివ్యాంగులకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తారని తెలపడం జరిగినది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల ఉపాధ్యక్షులు ప్రసాద్ రావు, యూనిట్ ఇంచార్జ్ మోమిన్ షాకీర్ , టిడిపి నాయకులు ఓబులేసు, మైనార్టీ నాయకులు మోమిన్ ఇబ్రహీం కలీలుల్లా, మోటార్ షఫీ ఉల్లా, ఎన్ఎస్ హాశం, దివ్యాంగుల రాష్ట్ర నాయకులు శ్రీనివాస్, ,వైస్ ప్రెసిడెంట్ చెన్నయ్య, కలిముల్లా, ముర్తుజా, రమణ, శివప్రసాద్, కరీం, మాబాషా, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News