Sunday, 13 September 2026 01:39:33 AM
# నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్

ఎన్టీఆర్ జిల్లాలో ప్ర‌శాంతంగా ఇంట‌ర్ ప‌రీక్ష‌లు

ప‌రీక్షా కేంద్రాల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ‌

Date : 23 February 2026 11:46 PM Views : 199

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : - ఎన్టీఆర్ జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు సోమ‌వారం ప్రారంభం కాగా ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో జ‌రుగుతున్నాయి. జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ న‌గ‌రంలోని వివిధ ప‌రీక్షా కేంద్రాల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. శార‌దా క‌ళాశాల‌, పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ క‌ళాశాల‌లోని ప‌రీక్షా కేంద్రాల‌ను ప‌రిశీలించారు. పరీక్షలు పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో, నియమావళి ప్రకారం జరుగుతున్నాయా అనే అంశాలను స్వయంగా పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వ‌ద్ద భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, స‌రైన విధంగా హాజరు నమోదు, ఇన్విజిలేటర్ల విధుల నిర్వహణ వంటి అంశాలను సమగ్రంగా సమీక్షించారు. పరీక్షా హాళ్లలో విద్యార్థులు సౌకర్యవంతంగా పరీక్ష రాయడానికి తగిన డెస్కులు, లైటింగ్, ఫ్యాన్లు, తాగునీటి సదుపాయం, ఫ‌స్ట్ ఎయిడ్ వంటి ఏర్పాట్లు ఉన్నాయని అన్నారు. మాల్ ప్రాక్టీసులను పూర్తిగా నివారించేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమల్లో ఉన్నందున అనవసరంగా ఎవరూ గుమికూడరాదని, తల్లిదండ్రులు, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప‌రీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సమయానికి కేంద్రాలకు చేరుకునేలా, పరీక్షా నియమాలు కచ్చితంగా పాటించేలా చూడాల‌న్నారు. పరీక్షలను సజావుగా, నిరాటంకంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని కలెక్టర్ ల‌క్ష్మీశ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 36,928 మంది మొద‌టి సంవ‌త్స‌రం విద్యార్థులు, 39,980 మంది ద్వితీయ సంవ‌త్స‌రం విద్యార్థులు మొత్తం 76,908 మంది విద్యార్థుల‌కు 98 ప‌రీక్షా కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. ఉద‌యం 9 గం. నుంచి మ‌ధ్యాహ్నం 12 గం. వ‌ర‌కు ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయి. త‌నిఖీల్లో జిల్లా ఇంట‌ర్మీడియెట్ విద్యాధికారి బి.ప్ర‌భాక‌ర‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: