Tuesday, 15 September 2026 01:33:13 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

బాలికల,మహిళల విద్యా విప్లవ జ్యోతి సావిత్రిబాయి పూలే

ప్రజాసంఘాల నాయకులు

Date : 03 January 2026 06:23 PM Views : 269

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : సావిత్రిబాయి పూలే 195వ జయంతిని పురస్కరించుకొని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న సందర్భంగా పాములపాడులోని, సేవా భారతి(వై ఆర్ డి ఎస్) కార్యాలయం దగ్గర మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి.అంకన్న ఆధ్వర్యంలో బీసీ ఐక్య సంఘం అధ్యక్షుడు గట్టు.శంకర్ గౌడ్, రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ శివలక్ష్మి రెడ్డి, బీసీ సంఘం నాయకుడు జి.సాయి కృష్ణ, రజక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వి.రామకృష్ణుడు, సేవా భారతి యూత్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు- ఎస్.షర్ఫద్దీన్ అలి, సోషల్ మీడియా ప్రతినిధులు డక్కా.శ్రీకాంత్, జి.ప్రవీణ్, ప్రజా సంఘాల నాయకులు నాగంపల్లె వెంకటరెడ్డి, మేకల.సుధాకర్, రాజేష్, తదితర నాయకులతో కలిసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా అర్పించారు. సావిత్రి బాయి పూలే అమర్ రహే భారత్ మాతాకీ జై అంటూ నినాదాలతో ఘనమైన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి. అంకన్న, బీసీ ఐక్య సంఘం అధ్యక్షుడు గట్టు.శంకర్ గౌడ్, రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ శివలక్ష్మి రెడ్డి, రజక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వి.రామకృష్ణుడు, బీసీ సంఘం నాయకుడు జీ.సాయి కృష్ణ, సేవా భారతి( వై ఆర్ డి ఎస్) అధ్యక్షుడు-ఎస్.షర్ఫద్దీన్ అలి, తదితర ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే ఒక చరిత్ర వ్యక్తిగా మాత్రమే కాకుండా వృత్తి నిబద్ధతకు మరియు సామాజిక బాధ్యత ఆదర్శంగా స్ఫూర్తిగా నిలిచిన విధానాన్ని మహిళా ఉపాధ్యాయులు స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు తీర్చిదిద్దుతూ సామాజిక బాధ్యతలో కూడా రాణించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకొని శ్రద్ధగా చదివి లక్ష్యం ను ఆత్మవిశ్వాసమును ధైర్యమును స్ఫూర్తిగా తీసుకొని సమాజసేవలో రాణించాలని పిలుపునిచ్చారు. సావిత్రిబాయి పూలే గారు స్త్రీ విద్య కోసం మహిళా హక్కుల కోసం దళితుల కోసం, శూద్రుల కోసం, వెనకబడిన వర్గాల కోసం భర్త మహాత్మా జ్యోతిరావు పూలే తో చేసిన కృషి సమాజానికి స్ఫూర్తిదాయకమన్నారు. సావిత్రిబాయి పూలే గారు భారతీయ సంఘసంస్కర్తగా ఉపాధ్యాయునిగా రచయిత్రగా మహిళా ఉపాధ్యాయులకు సమాజానికి మార్గదర్శకం కుల వ్యవస్థకు పితృస్వామానికి వ్యతిరేకంగా పోరాటం చేయటంలో బాధ్యతగా భావించి దంపతులైన సావిత్రిబాయి పూలే గారు మహాత్మ జ్యోతిరావు పూలే అనగారిన వర్గాల అభ్యున్నతికి కృషిచేసి, చరిత్రకే స్ఫూర్తిదాతలుగా నిలిచారు విద్య శక్తివంతమైన సాధనమని బాలికల విద్య కోసం సమాజంలో వ్యతిరేకత ఉన్న, అవమానాలు ఎదురైనా ధైర్యంగా ఆడపిల్లలు చదవాలని 1848 సంవత్సరంలో పూణేలో పాఠశాలను స్థాపించి మరల ఇంకా 50 పాఠశాలలో స్థాపించారన్నారు. 1873లో సత్యశోధక్ సమాజ్ సంఘాన్ని స్థాపించి మహిళా హక్కుల కోసం పోరాటం పోరాటం చేసి, మహిళా సాధికారతకు మార్గదర్శిగా నిలిచారన్నారు. 1897లో మహారాష్ట్రలో ప్లేగు వ్యాధి వ్యాపించినప్పుడు ప్లేగు వ్యాధి రోగులకు సేవలు చేసి ప్రాణాలు అర్పించిన త్యాగమూర్తి అని అన్నారు. సమాజం అభివృద్ధి చెందాలంటే విద్య ద్వారానే సాధ్యమవుతుందని మహిళలు అన్ని రంగాలలో రాణించి సామాజిక సేవలో మార్గదర్శకంగా నిలవాలని కోరారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :