ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / జూపాడుబంగ్లా : జూపాడు బంగ్లా మండలంలోని, 80 బన్నూరు, మండ్లెం గ్రామాలలో ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మరియు జిల్లా అడిషనల్ డిఎంహెచ్వో డాక్టర్ శారద బాయి ఆదేశాల మేరకు దిశా సహకారంతో గ్రామస్థాయిలో సంచార వాహనం ద్వారా సుఖ వ్యాధులకు సంబంధించి హెచ్ఐవి పరీక్షలు చేయడం జరిగింది. కావున ప్రతి గ్రామంలో కూడా 20 ఏళ్ల పైబడిన వారు కచ్చితంగా పరీక్షలు చేసుకొనీ వారి స్థితిని తెలుసుకోగలరు కావున ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరడం జరిగింది, వ్యాధులను త్వరగా గుర్తించడం ద్వారా ట్రీట్మెంట్ అందించడం జరుగుతుందన్నారు. కావున వాళ్ళ యొక్క జీవిత కాలన్నీ పొడిగించుకోవడానికి అవకాశం ఉంటుంది, కావున ప్రతి ఒక్కరు కూడా సుఖ వ్యాధులపైన అవగాహన కలిగి ఉండాలని కోరడమైనది. ఈ కార్యక్రమంలో చైల్డ్ ఫండ్ ఇండియా డిఆర్పి నాగరాజు, సూపర్వైజర్ మీరామ్ రెడ్డి, ల్యాబ్ టెక్నీషియన్ బాలాజీ నాయక్, క్లస్టర్ లింక్ వర్కర్స్ టీ.షాజహాన్ బేగం, సరోజ, అవుట్ రీచ్ వర్కర్ మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News