ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : దేశభాషలందు తెలుగు లెస్స అని కురుకుంద ఉన్నత పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు జగదీశ్వరి అన్నారు. శనివారం నాడు ఆత్మకూరు మండలంలోని, కురుకుంద ఉన్నత పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇన్చార్జి హెచ్ఎం జగదీశ్వరి మాట్లాడుతూ తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడు చరిత్రకారుడు సంఘసంస్కర్త హేతువాది ఉపాధ్యాయుడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు 163 వ జన్మదినోత్సవాన్ని మరియు జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి నిత్య వ్యవహారములోని భాషలో ఉన్న అందాన్ని విలువను తెలియజేప్పిన మహనీయుడని, ఆంధ్రదేశంలో వ్యవహారిక భాష ఉద్యమానికి మూల పురుషుడు బహు భాషా కోవిదుడు సంఘసంస్కర్త హేతువాది శిష్ట జన వ్యవహారిక భాషను గ్రంథ రచనకు స్వీకరింప చేయడానికి చిత్తశుద్ధితో కృషిచేసిన అచ్చ తెలుగు చిచ్చర పిడుగు గిడుగు అని అన్నారు. గిడుగు ఉద్యమం వల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యవహారిక భాషలో సాగి అందరికీ అందుబాటులోనికి వచ్చిందని ఆమె అన్నారు. పండితులకే పరిమితమైన సాహిత్య సృష్టి, సృజనాత్మక శక్తి ప్రతి ఒక్కరికి వీలైందని, గిడుగు రామమూర్తి పంతులు జన్మ దినోత్సవం ఆగస్టు-29 తెలుగు భాషా దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నామనీ అన్నారు. తెలుగు భాష తేనే కన్నా తీయనిది, వెన్నకన్నా కమ్మనిది, చందమామ కన్నా చల్లనిది అని, తెలుగు నేర్చుకుందాం మన భవిత మార్చుకుందాం, మాతృభాష నేర్చుకో అనుబంధం పెంచుకో, తెలుగు జాతి మనది తెలుగు భాష మనది, తెలుగు నేలపైన తెలుగు వికసించాలి,మాతృభాష తెలుగు మన బ్రతుకంతా వెలుగు,నేర్చుకుందాం నేర్చుకుందాం తెలుగు భాషను నేర్చుకుందాం అని ఆమె అన్నారు. పి.డి-మురళి నాయక్ మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడలకు కూడా కొంత సమయాన్ని కేటాయించాలని ఆయన విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం వ్యాసరచన, పద్య పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జవహర్ నాయక్, మురళీ నాయక్, రవి, రవి ప్రకాష్, మాధవి, విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
E Nivas News