Saturday, 12 September 2026 10:39:55 PM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

పాములపాడు శ్రీ వివేకానంద విద్యా విహార్ హైస్కూల్‌లో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు... ఆర్ఎస్ఆర్.గోపాల్ (కరస్పాండెంట్)

Date : 03 September 2026 09:24 PM Views : 151

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని పాములపాడులోని, శ్రీ వివేకానంద హైస్కూల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులు చిన్నికృష్ణుడు, రాధాదేవి వేషధారణల్లో ముస్తాబై తమ అద్భుతమైన అభినయంతో అందరినీ ఆకట్టుకున్నారు. శ్రీకృష్ణుడి బాల్య లీలలను ప్రతిబింబించేలా విద్యార్థులు ధరించిన సంప్రదాయ వేషధారణలు, అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నికృష్ణులుగా ముస్తాబైన విద్యార్థులు వేణువు, నెమలి పింఛం, కిరీటం వంటి అలంకరణలతో ఎంతో అందంగా కనిపించారు. రాధాకృష్ణుల వేషధారణలో విద్యార్థులు ప్రదర్శించిన అభినయం కార్యక్రమానికి ప్రత్యేక శోభను తీసుకొచ్చింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను ఎంతో శ్రద్ధగా సిద్ధం చేశారు. వేషధారణ, అలంకరణ, అభినయం తదితర అంశాల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రత్యేకంగా మార్గనిర్దేశం చేశారు. దీంతో పాఠశాల ప్రాంగణం చిన్నికృష్ణుల సందడితో, భక్తి భావంతో కళకళలాడింది. ఈ సందర్భంగా శ్రీ వివేకానంద విద్యా విహార్ హైస్కూల్ కరస్పాండెంట్ ఆర్ఎస్ఆర్.గోపాల్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు మరియు పండుగల విశిష్టతను విద్యార్థులకు తెలియజేయడంతో పాటు, వారిలో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, కళాత్మక ప్రతిభను పెంపొందించడమే ఇటువంటి కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. విద్యార్థుల అద్భుతమైన వేషధారణలు, అభినయం, ఉత్సాహభరితమైన ప్రదర్శనలు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు పాఠశాల సిబ్బందిని విశేషంగా ఆకట్టుకున్నాయి. శ్రీకృష్ణాష్టమి వేడుకలు పాఠశాలలో ఆధ్యాత్మికతతో పాటు ఆనందోత్సాహాలను నింపాయి. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు రాయపాటి మురళీమోహన్, శ్రీ వివేకానంద విద్యా విహార్ హైస్కూల్ కల్చరల్ ఇంచార్జ్ షాజహాన్, పాఠశాల డైరెక్టర్ దేవిక, అడ్మినిస్ట్రేటర్ బాలకృష్ణమ్మ, సాంస్కృతిక విభాగం ఉపాధ్యాయులు మల్లిక, గాయత్రి, మైత్రి, ప్రియ, అకడమిక్ ఉపాధ్యాయులు సురేంద్ర, జయలక్ష్మి, స్రవంతి, శంకరి భాయి, శ్రీలక్ష్మి, రాణి, పుష్ప, చంద్రకళ, భాను, దీపిక, హబీబుల్లా, తిరుమలేష్, కలీమున్నీసా, విద్యార్థిని, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: