Monday, 14 September 2026 08:07:46 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

మామిడి తోటల రైతులు తగు జాగ్రత్తలు పాటించాలి

ఆత్మకూరు హార్టికల్చర్ అధికారిణి కె.చందన

Date : 17 January 2026 11:00 PM Views : 304

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : మామిడి తోటల రైతులు జాగ్రత్తలు పాటించాలని ఆత్మకూరు మండల హార్టికల్చర్ అధికారి కె.చందన శనివారం తెలిపారు. ఈ సందర్భంగా హార్టికల్చర్ అధికారిణి కె.చందన మాట్లాడుతూ.. మామిడి పూత ఈ సంవత్సరం ఆలస్యంగా రావడం కనిపిస్తోందన్నారు. ఇది ప్రధానంగా వాతావరణ మార్పులు, తీవ్రమైన చలి రాత్రులు, రాత్రి-పగలు ఉష్ణోగ్రతల మధ్య తీవ్రమైన తేడాలు, అకాల వర్షాలు వల్ల జరుగుతోందన్నారు. దీంతో పూత ఆలస్యమవుతుంది, కొన్ని చోట్ల పూత నల్లబడి రాలిపోతోందన్నారు. దిగుబడి తగ్గే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మామిడి రైతులు తీసుకోవాల్సిన ముఖ్యమైన సలహాలు- తక్షణ చర్యలు (పూత ఆలస్యమైన తోటల్లో పూలమొగ్గలను ఉత్తేజపరచడానికి) సూక్ష్మ పోషకాల పిచికారీ: జింక్ (జడ్ఎన్) + బోరాన్ (బోరాన్) మిశ్రమాన్ని చెట్లపై పిచికారీ చేయాలి. బోరాక్స్ పొడిని 1 లీటరు నీటికి 2 గ్రాములు కలిపి పూత మొగ్గలు బయటకు రాకముందే స్ప్రే చేయండి. ఇది పూత రావడానికి, పిందెలు రాలకుండా ఉండటానికి సహాయపడుతుందన్నారు. 13-0-45 5జి/లీటర్ + ఫార్ములా 4, 5జి/లీటర్ చొప్పున పిచికారీ చేయడం ద్వారా మిగిలిన పూత బయటికి రావడానికి సహాయపడుతుందన్నారు. పూత ఎక్కువగా రాలుతుంటే ప్లానోఫిక్స్ జాగ్రత్తగా, సరిగ్గా 5 ఎంఎల్/ 20 లీటర్ నీటికి చొప్పున పిచికారి చెయ్యాలన్నారు. పూత, పిందె దశలో పొగమంచు, అధిక తేమ వల్ల ఆకుపచ్చ తెగులు (అంత్రాక్నోస్), పూతమాడు (పోడేరీ మిల్డ్యూ), నల్లమచ్చ వంటివి ఎక్కువగా వస్తాయి. నీటిలో కరిగే గంధకం (సల్ఫర్) 3 గ్రాములు 1 లీటరు నీటికి కలిపి పూతకు ముందు, పూత తర్వాత, పిందె దశలో పిచికారీ చేయాలని తెలిపారు. తేనె మంచు పురుగులు, తామర పురుగులు ఎక్కువగా ఉన్నట్లయితే బుఫ్రొఫెజిన్ 1. 65ఎంఎల్/ లీటర్ లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.5ఎంఎల్ / లీటర్ లేదా థయోమిథాక్సామ్ 40జి/ ఎకరా వంటివి పిచికారీ చేయాలన్నారు. నీటి యాజమాన్యం & ఎరువులు పూత వచ్చిన తర్వాత డ్రిప్ ద్వారా లేదా తేలికగా నీరు ఇవ్వాలని, నీటి ఎద్దడి రాకుండా చూడాలన్నారు. యూరియా 1/2 కెజీ+ పొటాష్ 1/4 కేజీ ఒక చెట్టుకు చొప్పున వేసుకుంటే కాయ ఎదుగుదల బాగుంటుందన్నారు. ముఖ్య జాగ్రత్తలు: పూత, పిందె దశలలో ఉన్నప్పుడు దున్నడం చేయకూడదు, కలుపు మందులు కొట్టరాదన్నారు. ఇప్పుడు పూత ఆలస్యమైనా, సరైన జాగ్రత్తలతో మంచి పిందె, కాయలు వచ్చే అవకాశం ఉంది. అలాగే వచ్చిన పూత, పిందెలను జాగ్రత్తగా కాపాడుకోవడం ద్వారా మంచి మార్కెట్ ధరలను పొందవచ్చు అన్నారు. పిందె దశలలో మామిడి పండ్లకు కవర్లు తొడగడం ద్వారా మంచి నాణ్యత, ధర లభిస్తాయి మరియు చీడ పీడల నుండి రక్షణ లభిస్తుందన్నారు. పండ్లు కోతకు వచ్చే సమయంలో పండు ఈగ చాలా నష్టం చేస్తుంది. నివారణకు లింగాకర్షక బుట్టలను ఎకరాకు 8-10 వాడాలన్నారు. పండ్ల కవర్లకు ఉద్యాన శాఖ ద్వారా హెక్టారుకు రూ.25,000/- సబ్సిడీ పొందవచ్చని. కాయలను మార్కెట్ చేస్కుకోవడానికి ప్లాస్టిక్ క్రేట్లు (టమాటో బాక్సులు) సబ్సిడీ లో రూ.120/- కి లభిస్తాయని తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :