Monday, 14 September 2026 12:00:49 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

దేశం గర్వించదగ్గ గొప్ప సంఘ సేవకుడు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్

గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జవహర్ నాయక్

Date : 15 February 2026 06:37 PM Views : 253

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : దేశం గర్వించదగ్గ ఆధ్యాత్మికవేత్త, సంఘ సేవకులు, సుగాలి గిరిజనుల జాతిపిత,ఆరాధ్య దైవం సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ అని గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జవహర్ నాయక్,గిరిజన నాయకులు ఈశ్వర్ నాయక్ అన్నారు. ఆదివారం నాడు ఆత్మకూరు మండలంలోని ఇందిరేశ్వరం గ్రామంలో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జవహర్ నాయక్, గిరిజన నాయకుడు ఈశ్వర్ నాయక్ లు మాట్లాడుతూ ధర్మియాడి, భీమానాయక్ దంపతులకు మొదటి సంతానంగా జన్మించిన సేవాలాల్ మహారాజ్ పుట్టుకతోనే సంపూర్ణ జ్ఞానం కలిగినవాడని,చిన్నప్పటి నుంచే సేవాగుణం కలిగిన వారని, సుగాలి గిరిజనుల హక్కుల కోసం పోరాడిన గొప్ప నాయకుడని, బ్రిటిష్ వారి పాలనలో మతమార్పిడిలను అడ్డుకున్నారని, దేశవ్యాప్తంగా సుగాలి గిరిజనులను చైతన్యపరుస్తూ తండాల అభివృద్ధికి కృషి చేశారని, సుగాలి గిరిజన సమాజంలో ఉన్న అపోహాలు మూఢనమ్మకాలను తొలగించేందుకు కృషి చేశారని, సుగాలి గిరిజనుల సంస్కృతిని కాపాడుతూ సమాజాన్ని సన్మార్గంలో నడిపించారని,సుగాలి గిరిజనుల ఆరాధ్య దైవం జాతిపిత,సేవాలాల్ మహారాజ్ జన్మదినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని,శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి-15 వ తేదీని సెలవు దినంగా ప్రకటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. సేవాలాల్ మహారాజ్ జయంతిని సుగాలి గిరిజన జాతి ప్రజలు ఒక పండుగలాగా జరుపుకుంటారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మా నాయక్, నాగరాజు నాయక్, పెద్ద లక్ష్మనాయక్, హరీష్ నాయక్, శివమణి నాయక్, జయమ్మ బాయి, నాగమ్మ బాయి, సుభద్ర బాయి, కేషమ్మ బాయి, యశోద బాయి, రాజేశ్వరిబాయి, కళావతి బాయి, రాధా బాయి, తదితరులు పాల్గోన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: