Tuesday, 28 July 2026 08:27:45 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

రాష్ట్ర మంత్రి , జిల్లా కలెక్టర్ ల చేతుల మీదుగా పాములపాడు విద్యార్థి సయ్యద్.మహమ్మద్ అయాజ్ అలీకి 'రాష్ట్రస్థాయి షైనింగ్ స్టార్' ప్రతిభ అవార్డు

Date : 21 July 2026 04:08 PM Views : 212

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రదానం చేసే ప్రతిష్టాత్మక రాష్ట్రస్థాయి 'షైనింగ్ స్టార్' ప్రతిభ అవార్డును పాములపాడులోని, శ్రీ వివేకానంద విద్యావిహార్ హైస్కూల్ విద్యార్థి సయ్యద్. మహమ్మద్ అయాజ్ అలీ అందుకున్నారు. నంద్యాలలో నిర్వహించిన పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ & మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.డి. ఫరూక్, జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గణియా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి శంకర్ నాయక్, డిఇఓ జనార్దన్ రెడ్డి, తదితర ప్రముఖుల చేతుల మీదుగా విద్యార్థి ఎస్.అయాజ్ అలీ కి ఈ అవార్డును అందజేసి అభినందించారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచి తమ మండలానికి, పాఠశాలకు మంచి పేరు తీసుకువచ్చిన అయాజ్ అలీని పలువురు ప్రముఖులు శ్రీ వివేకానంద విద్యా విహార్ పాఠశాల కరస్పాండెంట్ ఆర్.ఎస్.ఆర్.గోపాల్, పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ రాయపాటి.దేవిక లు విద్యార్థి కృషిని అభినందిస్తూ, రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థి తల్లి తండ్రులు కో-ఆప్షన్ మెంబర్ సయ్యద్.ముర్తుజాఅలి మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యం వల్లే మా కుమారుడికి షైనింగ్ స్టార్ ప్రతిభ అవార్డు రావడం అభినందనీయం అన్నారు. తన కుమారుడు ఆయాజ్ అలీ ని ఐఐటీఎన్ గా చేయడమే తన లక్ష్యం మన్నారు. కుటుంబ సభ్యులు సేవా భారతి (వై ఆర్ డి ఎస్) అధ్యక్షులు ఎస్.షర్ఫద్దీన్ అలీ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సయ్యద్.షేక్షాఅలీ, చిన్నప్పుడు నుంచి కష్టపడి చదివే తత్వం ఎస్.ఆయాజ్ అలి ది అని కొనియాడారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు విద్యార్థులకు మంచి విద్యా బోధన చేసిన శ్రీ వివేకానంద విద్యా విహార్ హైస్కూల్ కరస్పాండెంట్ ఆర్ఎస్ఆర్. గోపాల్, హెచ్ఎం రాయపాటి దేవిక లకు ఉపాధ్యాయులకు మరియు సిబ్బంది కి ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్ననాటి నుంచే చదువులో, ఇతర కార్యక్రమాల్లో ప్రతిభ చూపుతున్న అయాజ్ అలీకి రాష్ట్రస్థాయి అవార్డు రావడం పట్ల జిల్లా, డివిజన్, నియోజవర్గ, మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు, తోటి విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :