Monday, 14 September 2026 12:24:58 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

"పొరుగువారి హక్కుల దేశవ్యాప్త ఉద్యమం" పోస్టర్ లను ఆవిష్కరించిన ఎమ్మిగనూరు జమాత్ అధ్యక్షులు చాందన్న

Date : 21 November 2025 07:17 PM Views : 305

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ / ఎమ్మిగనూరు : జమాఆతె ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నవంబర్ 21-30 వరకు నిర్వహించనున్న పొరుగువారి హక్కుల ఉద్యమాన్ని ఎమ్మిగనూరు పట్టణంలో అమీరె ముఖామి జనాబ్ చాంద్ బాష చేతుల మీదుగా పోస్టర్లు, కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా మౌలానా సద్దాం హుస్సేన్ మాట్లాడుతూ కుంచించుకు పోతున్న మానవ సంబంధాలు పెంపొందించుటకు, ఏకాంత జీవితానికి అలువాటు పడుతున్న ప్రజల్లో పరస్పర మానవ సంబంధాలు పెంచుటకు, ప్రజలలో సామాజిక చింతన కలిగించుటకు జమాఅతె ఇస్లామి హింద్ దేశవ్యాప్తంగా నవంబర్-21 నుండి 30వ తేదీ వరకు "పొరుగువారి హక్కుల ఉద్యమం" నిర్వహిస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో ఇరుగుపొరువారితో సత్సంబంధాలు, ఇచ్చిపుచ్చుకునే పూర్వ సాంప్రదాయాలు పరస్పర సహాయ సహకారాలు, అన్యోనతలు కలిగించుటకు వివిధ రూపాల్లో ఉద్యమాన్ని ప్రజల్లో తీసుకుని పోతామని, దైవ గ్రంధం ఖుర్ఆన్ తాకీదు చేసిన, ప్రవక్త ప్రవచనాల్లొ భోధించిన పోరుగువారి హక్కులు బాధ్యతగా స్వీకరించమని, ముస్లిం సమాజాన్ని కోరుతామని తమ చుట్టుపక్కల ఉన్న అన్ని మతాల వారితో నిష్కల్మష సంబంధాలు కలిగిస్తామని తెలిపారు. ఇరుగు- పొరుగువారు కలిసి ఉండటం ఐక్యతకు నిదర్శనం అన్నారు. ఈ ఉద్యమ నిర్వహణకు జనాబ్ ఖదీర్ భాష కన్వీనర్ గా వ్యవహరిస్తారన్నారు. చాంధన్న మాట్లాడుతూ స్థానికంగా ప్రతీ ఏరియాలో ఉన్న కళాశాలల్లో, పాఠశాల ప్రాంగణాల్లో పొరుగువారి బాధ్యతలు గుర్తు చేస్తామని, శుక్రవారం ప్రసంగాల్లో, కార్నర్ మీటింగుల్లో పొరుగవారి హక్కులు, సంబంధ బాంధవ్యాల ఆవశ్యకత గురించి వివరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఖిద్ మత్ డైరెక్టర్ అల్తాఫ్, లాల్ సాబ్, అభిరామ్, అమీర్, ఖదీరన్న, మహేష్, జాకీర్, నందవరం రహీమ్, కుమార్, అలీ, హుస్సేన్, రెహమాన్, ముఖామి జమాత్ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :