ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, ఎర్రగూడూరు నేషనల్ హైవే రహదారి పక్కన జంబూల్లమ్మ దేవాలయం దగ్గర శ్రీశైలం వెళ్లే పాదయాత్రికులు, భక్తులకు మాండ్ర.శివానందరెడ్డి సేవాదళ్ భావన రాము టీమ్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్బంగా ఐదు రోజులుగా అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఇది రెండో సంవత్సరం కూడా శివ స్వాముల కొరకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం మండల సాంస్కృతిక విభాగం అధ్యక్షులు భావన వినోద్ కుమార్, మిట్టకందాల సీనియర్ నాయకులు సంజన్న, నియాజ్, రామకృష్ణ, బూత్ 206 ఇంచార్జి నాగ శ్రీనివాసులు, తదితరులు పాల్గొని అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది.
Admin
E Nivas News