ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : నేడు నంద్యాల జిల్లా, ఉయ్యాలవాడలోని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దగ్గర మండల పి ఆర్ టి యు తరపున నూతన ఉపాధ్యాయులకు సర్వీస్ రిజిస్టర్ లను అందించినట్లు పి ఆర్ టి యు సీనియర్ నాయకులు వై.రమణయ్య, కె.నాగేశ్వరావు తెలిపారు. పి ఆర్ టి యు ఉయ్యాలవాడ మండల అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు ఎ.రవికుమార్, ఆదమ్ ల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పి ఆర్ టి యు సంఘం ఉపాధ్యాయుల సంక్షేమం కోసం చేసిన కృషి, సాధించిన విజయాలను నూతన ఉపాధ్యాయులకు తెలిపి, పి ఆర్ టి యు ప్రాథమిక సభ్యత్వం ఇచ్చి, సభ్యులుగా చేర్చారు. ఈ సందర్భంగా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, ఉపాధ్యాయులకు ఉమ్మడి సర్వీస్ రూల్స్ సాధించి పదోన్నతులు కల్పించాలని, పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు.
Admin
E Nivas News