ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, కృష్ణానగర్ గ్రామంలో హిందూ సమ్మేళనం కార్యక్రమం విజయవంతం అయింది. ఈ సందర్భముగా విశిష్ఠ అతిదులు శ్రీశ్రీశ్రీ సద్గురు రామనంద స్వాముల, శ్రీశ్రీశ్రీ పద్మానంద యోగి లు మాట్లాడుతూ స్వశక్త హిందూ స్వాభిమాన్ నిర్మాణం కోసం మరియు ప్రతి హిందువులో ఆత్మ విశ్వాసాన్ని నింపడం కోసం ఆర్ఎస్ఎస్అనేక సంవత్సరాల నుంచి నిరంతరం శ్రమిస్తూ హిందూ సమాజాన్ని జాగృతం చేస్తూ, ప్రతి ఒక్కరిలోనూ జాతీయ భావాలను నిర్మాణము చేస్తూ నేడు 100వ సంవత్సరములోకి అడుగు పెడుతున్న సందర్భముగా కృష్ణానగర్ గ్రామంలో హిందూ సమ్మేళనాన్ని నిర్వహించిందన్నారు. ప్రతి హిందువులలో ఆత్మ విశ్వాసాన్ని నింపడం కోసం మన గ్రామాలలో మరియు బస్తీలలో హిందుత్వ వాతావరణం నిర్మాణం చేయడం, మత మార్పిడులకు అడ్డుకట్ట వేయడం, మనమంతా హిందువులం, కులం మన ఇంటి వరకే పరిమితం కాదన్నారు. గడప దాటితే మనమంతా హిందువులం అనే భావన నిర్మాణం చేయయడం, మన దేవాలయ వ్యవస్థను కాపాడుకోవడం, సమాజంలో సామాజిక సమరసతను నిర్మాణం చేయడం, కుటుంబ వ్యవస్థ బలోపేతం చేసుకోవడం మనందరి బాధ్యత, ఇదే ఈ హిందూ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు హిందూ ప్రముఖులు ఆర్ఎస్ఎస్ తిమ్మారెడ్డి, ఈరన్న, బిజెపి మండల అధ్యక్షుడు రాయపాటి మురళీమోహన్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News