ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అనంతపురం : పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామంలో స్పౌస్ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ సచివాలయ ఉద్యోగస్తులతో, కార్యకర్తలతో కలిసి పాల్గొని, ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు నగదు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ప్రతి నెల ఒకటవ తేదీననే పెన్షన్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనది అన్నారు. ఇలాంటి ప్రభుత్వంలో మనం ఉన్నందుకు చాలా గర్వపడాలని ప్రజలు తెలియజేశారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ల వలన ఎందరో వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, చేనేత కార్మికులకు, కల్లుగీత కార్మికులకు, ఒంటరి మహిళలకు తమ జీవనానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. త్వరలో కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేయడానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉత్సాహంతో ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ బోనపల్లె సత్యరాజు, బూత్ కన్వీనర్ బోనపల్లె వినయ్ కుమార్, నెంబర్ లక్ష్మన్న, సుబ్బారావు, హుస్సైనయ్య,తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News