ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : మంగళగిరి కేంద్ర కార్యాలయంలో నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన అధికార ప్రతినిధి మరియు కార్యదర్శిగా ఎన్నికైన అలీ హుస్సేన్, తిమోతి లను పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. ఈ నెల-27వ తేదీన మంగళగిరి కేంద్ర కార్యాలయంలో, జరిగిన ఒక కార్యక్రమంలో వారు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు కి పార్టీ కండువాలు కప్పి, నూతన బాధ్యతల పట్ల శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతం క్షేత్రస్థాయిలో పార్టీ సిద్ధాంతాలను, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి కి దిశానిర్దేశం చేశారు. నంద్యాల జిల్లా అభివృద్ధి కమిటీలో కీలక బాధ్యతలు చేపట్టిన వీరు, జిల్లా అభివృద్ధిలో మరియు పార్టీ బలోపేతంలో క్రియాశీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. తమపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించినందుకు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా.రాజశేఖర్ రెడ్డి కి అలీ హుస్సేన్, తిమోతి లు పార్టీ నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని నూతన అధికార ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Admin
E Nivas News