ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / జూపాడుబంగ్లా : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్ )నుంచి నందికొట్కూరు నియోజకవర్గం, జూపాడుబంగ్లా మండలంలోని, తూడిచెర్ల గ్రామానికి చెందిన బరూరి.తన్విక అనే చిన్నారి కి 20,674/- రూపాయలకు సంబంధించిన చెక్కును నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మాండ్ర. సురేంద్రనాథ్ రెడ్డి లు అందించడం జరిగింది. గ్రామంలోని, శంకరమల్లేశ్వర స్వామి దేవాలయం నందు జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. అక్కడి ఆలయ అర్చకులు ఎమ్మెల్యే గిత్త.జయసూర్య, టిడిపి సీనియర్ నాయకులు మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి లకు శాలువాలు కప్పి, మెడలో పూలమాలలు వేసి, పూర్ణకుంభంతో ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర యాదవ సంఘం డైరెక్టర్ కడియం వెంకటేశ్వర్లు యాదవ్, కడియం వేణు, కడియం సంపంత్ కుమార్, యూనిట్ ఇంచార్జ్ శంకరయ్య, వేణుగోపాల్, కడియం సురేష్ బాబు, రెడ్డి సుబ్బయ్య, పుల్లయ్య, దస్తగిరి, ఎల్ల పుల్లయ్య, చిన్న సుబ్బారాయుడు, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఎ- రవీంద్ర, మాండ్ర.శివానందరెడ్డి పిఎ- మద్దిలేటి, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News