Thursday, 30 July 2026 05:09:09 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

పాములపాడులో ఘనంగా 76వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

మార్చే ఎలాంటి కుయుక్తులను అనుమతించేది లేదు ప్రజాసంఘాల నాయకులు

Date : 26 November 2025 10:44 PM Views : 259

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : మండల కేంద్రమైన పాములపాడులో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో 76వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి జాతీయ మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు-నల్లమల.అబ్రహం, సామాజిక రాయలసీమ రాష్ట్ర సాధన సమితి అధ్యక్షుడు-డాక్టర్ డి.నాగన్న, మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి.అంకన్న, అంబేద్కర్ యూత్ అధ్యక్షుడు కలబండి.నాగరాజు, ఎమ్మార్పీఎస్ & ఎంఎస్పి జిల్లా నాయకుడు కోట.ప్రభాకర్, బీసీ ఐక్య సంఘం అధ్యక్షుడు గట్టు. శంకర్ గౌడ్, మండల కో-అప్టెడ్ మెంబర్- సయ్యద్.ముర్తుజాఅలీ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు-సయ్యద్.షేక్షాఅలి, వైఎస్ఆర్సిపి మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు-సయ్యద్ బాష, మాల మహానాడు నాయకుడు కే.బాలస్వామి, జాతీయ బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి-డాక్టర్ బత్తుల.సంజీవరాయుడు, తదితర ప్రజాసంఘాల నాయకులు పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంటరాని తనం, కుల వ్యవస్థను రూపుమాపిన మహనీయుడు భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అన్నారు. దేశ పౌరులందరికీ పేరుపేరునా భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. కోట్లాది భారతీయుల ఆశయాలను, వారి హక్కులను, స్వేచ్ఛను, గౌరవాన్ని, న్యాయాన్ని కాపాడేది మన భారత రాజ్యాంగం అని అన్నారు. పేదలైనా, ధనికులకైనా, ఏ కులమైన, ఏ మతమైనా అందరు కూడా రాజ్యాంగం దగ్గర సమానమే అని అన్నారు. రాజ్యాంగం కేవలం పుస్తకం కాదు ప్రతి పౌరుడికి దక్కిన అరుదైన గొప్ప వాగ్దానం అని అన్నారు. దేశ ప్రజలకు దశ-దిశ కల్పించిన పవిత్ర గ్రంథాన్ని తొలిచేలా చుట్టూ నేడు మతతత్వ బిజెపి పార్టీలు, దానికి మద్దతు ఇచ్చే పార్టీలు చెద పురుగులుగా చేరాయనీ ఆవేదన వ్యక్తం చేశారు. వీరందరూ కూడా భారత రాజ్యాంగాన్ని తినేసి, చరిత్రను రూపు మాపాలని చూస్తున్నాయన్నారు. సొంత రాజ్యాంగాన్ని లిఖించాలని కుట్రలు చేస్తున్నాయన్నారు. ప్రజల హక్కులను హరించి మత ఛాందసవాదాన్ని రెచ్చగొట్టాలని పన్నాగాలు పన్నుతున్నాయన్నారు. రాజ్యాంగం సురక్షితంగా ఉన్నంతకాలం ప్రజల హక్కులు సురక్షితం ఉంటాయన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ దేశ పౌరులుగా ప్రతిజ్ఞ చేస్తున్నామని రాజ్యాంగంపై జరిగే దాడిని ఎదుర్కోవడం, రక్షించడంలో మొదటి స్థానంలో నిలబడటం నా కర్తవ్యం అని ప్రతిజ్ఞ చేయడం జరిగింది. రాజ్యాంగాన్ని మార్చే ఎలాంటి కుయుక్తులను అనుమతించేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకుడు జి.సాయికృష్ణ, ఎమ్మెస్పి మండల నాయకుడు జే.శ్రీనివాసులు, వైయస్సార్సీపి మండల నాయకుడు మురహరి. రాజన్న, బాలకచెర్ల ఉపసర్పంచ్- నరసింహులు గౌడ్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు బొల్లెద్దుల. మోహన్, కొత్తపల్లి నాయకుడు బలరాం, టిడిపి నాయకుడు సుంకన్న, శివుని పార్టీ నాయకులు బాలయ్య, ఏసన్న, వికలాంగుల సంఘం అధ్యక్షుడు శీలం.శ్రీనివాస్, సేవా భారతి యూత్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు- ఎస్. షర్ఫద్దీన్ అలి, మాల మహానాడు మండల నాయకుడు- ఎస్.యేసన్న, తదితర ప్రజాసంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: