ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు పట్టణంలోని, కొండారెడ్డి బురుజు వద్ద డ్రగ్స్ మాఫియా నివారణ కోసం ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు.చరిత రెడ్డి, మంత్రి టీ.జీ.భరత్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఏపీఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని లు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్- జీ.నాగముని మాట్లాడుతూ “యువత భవిష్యత్తును చెడగొడుతున్న డ్రగ్స్‌ను సమూలంగా నిర్మూలించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రతి యువకుడు డ్రగ్‌ల నుండి దూరంగా ఉండాలని, బంగారు భవిష్యత్తును పాడు చేసుకోకుండా సమాజంలో మంచి ఆలోచన విధానంలో, నలుగురికి ఆదర్శంగా మంచి పౌరులుగా జీవించాలని అన్నారు. ఈ విధంగా నగరంలో అవగాహన కల్పిస్తూ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ-భరత్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఏపీ రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జి.నాగముని, పోలీసు అధికారులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మరియు భారీ సంఖ్యలో యువత పాల్గొన్నారు. నగరంలో అవగాహన కల్పిస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు.
Admin
E Nivas News