ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ శ్రీశైలం : నేడు జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైలం దేవస్థానానికి రూ. 5,88,89,846/-లు నగదు రాబడిగా లభించింది. కాగా ఈ హుండీల రాబడిని భక్తులు గత 35 రోజులలో ( 22.07.2026 నుండి 25.08.2026 వరకు) సమర్పించడం జరిగింది. అలాగే ఈ హుండీలో 87 గ్రాముల, 200 మిల్లీగ్రాముల బంగారు, 4 కేజీల, 250 గ్రాముల వెండి లభించాయి. అదేవిధంగా 540-యుఎస్ఏ డాలర్లు, 1610– యు.ఏ.ఇ దిర్హమ్స్, 20-సింగపూర్ డాలర్లు, 140–ఇంగ్లాండు పౌండ్స్, 21–మలేషియా రింగిట్స్, 10–సౌదీరియాల్స్, 109- బహ్రెయిన్ దినార్, 100–ఓమన్ బైసా, 5-ఓమన్ రియాల్స్ మొదలైనవి ఈ హుండీల లెక్కింపులో లభించాయి. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టడం జరిగింది. ఈ హుండీల లెక్కింపును ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి యం.శ్రీనివాసరావు , ధర్మకర్తల మండలి సభ్యులు కె.కాంతివర్ధిని, ఉప్పుటూరి సుబ్బలక్ష్మి, పి.యు.శివమ్మ పర్యవేక్షించారు. అదేవిధంగా హుండీల లెక్కింపులో పలువిభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, దేవస్థానం సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.
Admin
E Nivas News