ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కురుకుంద గ్రామ ప్రభుత్వ జడ్పీ హైస్కూల్లో పనిచేస్తున్న గిరిజన ఉపాధ్యాయుడు కాట్రావత్ జవహర్ నాయక్ కుమారుడు సాయి సంతోష్ నాయక్ ఎంబిబిఎస్ సీటు సాధించడం జరిగింది. లక్ష్య సాధనలో ముగ్గురు పిల్లల దిగ్విజయం, సంతోషంలో తల్లిదండ్రులు కె.జవహర్ నాయక్, శారదబాయి లు మునిగి తేలుతున్నారు. కష్టపడి చదివితే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు. సాయి సంతోష్ నాయక్. జాతీయ స్థాయిలో నిర్వహించిన 2026 నీట్ పరీక్ష ఫలితాల్లో ఆయన విశేష ప్రతిభ కనబరిచారు. మొత్తం 495 మార్కులు సాధించిన కె. సాయి సంతోష్ నాయక్, ఆల్ ఇండియా ఎస్టీ కోటా విభాగంలో 977వ ర్యాంకును సొంతం చేసుకున్నారు. ఈ అత్యుత్తమ ర్యాంకుతో ప్రతిష్టాత్మకమైన కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ (ఎంబీబీఎస్) సీటును కైవసం చేసుకున్నారు. సంతోష్ విజయం వెనుక వారి కుటుంబ కృషి ఎంతగానో ఉంది. ఇప్పటికే ఈ దంపతుల ఇద్దరు పిల్లలు వైద్య విద్యను అభ్యసిస్తుండగా, ఇప్పుడు మూడో కుమారుడు సాయి సంతోష్ నాయక్ కూడా మెడికల్ సీటు సాధించడంతో ఆ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. ఒకే కుటుంబం నుంచి ముగ్గురు పిల్లలు వైద్య రంగాన్ని ఎంచుకుని, ఉన్నత విద్యకు ఎంపిక కావడంపై తల్లిదండ్రులు అమితానందం, హర్షం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల క్రమశిక్షణ, నిరంతర శ్రమే ఈ రోజు తమను సమాజంలో గర్వపడేలా చేసిందని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.కాట్రావత్ జవహర్ లాల్ నాయక్ కుమార్తెలు ప్రియాంక భాయి, ప్రీతి బాయి, కుమారుడు సాయి సంతోష్ నాయక్ కు బంధువులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, డాక్టర్లు, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు, ప్రజాసంఘాల నాయకులు, స్థానికులు శుభాకాంక్షలు తెలియజేసి, అభినందనలతో ముంచెత్తుతున్నారు.
Admin
E Nivas News