ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, రుద్రవరం గ్రామ నివాసి జడల రవీంద్ర కుమారుడు జడల ఆనంద్ మనోహర్ ఇటీవలే ఏపీ మోడల్ స్కూల్ లో పదవ తరగతి పూర్తి చేసుకుని ఐఐఐటి లో సీటు సాధించడం జరిగింది. ఐఐఐటి లో సీటు సాధించిన విద్యార్థి జడల ఆనంద్ మనోహర్ కి గ్రామ టీడీపీ నాయకులు రాచపూడి సురేష్, తెలుగు యువత మండల అధ్యక్షుడు షేక్.కరీం బాష లు శాలువా కప్పి, పూలమాలలు మెడలో వేసి, ఘనంగా సన్మానించడం జరిగింది. విద్యార్థి జడల ఆనంద్ మనోహర్ ఉన్నత చదువులు బాగా చదువుకొని, భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండాలని, ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జడల శ్రీను, బందేల శ్రీను, చంటి, శరత్, ఇర్ఫాన్, సుశాంత్, సాయి,శేఖర్, పాల్గొన్నారు.
Admin
E Nivas News