ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణంలోని, గవర్నమెంట్ జూనియర్ కళాశాల యందు ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవం దృష్ట్యా న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ సుంకన్న న్యాయవాదులు పుల్లారెడ్డి, బలరాం నాయక్, భాస్కర్, రాంప్రసాద్ లు మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాను ఎలా అరికట్టాలనే విషయాలపైన మరియు ఉచిత న్యాయ అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అధ్యాపకులు, దాదాపు 200 విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
E Nivas News